Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హోటల్ లో చాటుమాటుగా ఐపీఎల్ స్టార్ ప్లేయర్ ఘనకార్యం: సీసీటీవీ ఫుటేజీలో

ఐపీఎల్ స్టార్ ప్లేయర్ చిక్కుల్లో పడ్డాడు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రూపొందించిన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పరిణామం ఆ జట్టు కూడా వివరణ ఇచ్చుకునే పరిస్థితికి దారి తీసినట్టయింది. అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు.

ఆ ప్లేయర్.. కగిసొ రబడ. బస చేసిన స్టార్ హోటల్ లో రబడ స్కోక్ చేశాడు. సిగరెట్ తాగాడు. ఇది హోటల్ లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ క్లిప్ ఆన్‌లైన్‌లో విస్తృత చర్చకు దారితీసింది. ఈ ఫుటేజీలో రబడ స్పష్టంగా కనిపించాడు. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీకి సంబంధించిన మరికొందరు కూడా ఈ క్లిప్‌లో ఉన్నారు. వారెవరనేది స్పష్టం కావట్లేదు. ఈ వీడియో ఎప్పుడు రికార్డయిందనేది తెలియరావట్లేదింకా.

IPL Star Player Seen Smoking at Gujarat Titans Hotel During IPL Video Sparks Controversy Scrutiny

దక్షిణాఫ్రికాకు చెందిన రబడ.. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కీలక ఆటగాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లల్లో 10 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసుకున్న పర్పుల్ క్యాప్ జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. 22.20 సగటు, 9.73 ఎకానమీ రేటును నమోదు చేశాడు. ఈ వీడియో బయటపడటంతో రబడ గత చరిత్ర కూడా వెలుగులోకి వచ్చింది. గత ఐపీఎల్ సీజన్‌ టైమ్ లో సౌత్ ఆఫ్రికన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రగ్ ఫ్రీ స్పోర్ట్స్ విధించిన నెల రోజుల నిషేధానికి గురయ్యాడు.

టోర్నమెంట్ మధ్యలో నిషేధానికి గురయ్యాడు. ఆ తర్వాత మళ్లీ గుజరాత్ టైటాన్స్ జట్టులోకి తిరిగి వచ్చాడు. డోపింగ్ నేర వివరాలు బయటపెట్టకపోవడంతో పలు ఊహాగానాలకు తావిచ్చింది. ప్రస్తుతం, మూడు విజయాలతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ ఆరో స్థానంలో కొనసాగుతోంది, ప్లేఆఫ్ కోసం పోరాడుతోంది.

ఈ నెల 24న చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడాల్సి ఉందీ జట్టుకు. ఇదివరకు యుజువేంద్ర చాహల్ ఇదే తరహా ఆరోపణలను ఎదుర్కొన్నాడు. ధూమపానం చేస్తూ డ్రైవింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చిన వైరల్ క్లిప్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Wednesday, April 22, 2026, 15:07 [IST]
Other articles published on Apr 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+