క్రికెటర్ జితేష్ శర్మ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. నాగ్‌పూర్‌కు చెందిన షలక మాకేశ్వర్‌ను పెళ్లాడనున్నాడు. షలక మాకేశ్వర్‌తో తాజాగా నిశ్చితార్థం పూర్తయింది. పెద్దలు కుదర్చిన సంబంధానికి అతను ఓకే చెప్పాడు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మార్చిలో వివాహం జరిగే అవకాశం ఉంది.
మహారాష్ట్ర చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు. 2022లో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. పంజాబ్ కింగ్స్‌కు సెలెక్ట్ అయ్యాడు. అప్పటి నుంచీ జట్టులో కీలక పాత్ర పోషిస్తోన్నాడు.

ఇప్పటివరకు ఐపీఎల్‌లో 40 మ్యాచ్‌లను ఆడిన జితేష్ శర్మ.. 730 పరుగులు చేశాడు. అతని వ్యక్తిగత అత్యధిక పరుగులు 49 (నాటౌట్). బ్యాటింగ్ యావరేజ్ 22.81. 151.14 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. గత నాలుగు సీజన్లల్లోనూ నిలకడగా రాణిస్తోన్నాడు. 2022 సీజన్‌లో 234, 2023లో 309 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో 187తో రాణించాడు.
ఇదివరకు జాతీయ జట్టుకూ ఎంపికయ్యాడు జితేష్ శర్మ. భారత జట్టు తరఫున ఇప్పటివరకు తొమ్మిది టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 100 పరుగులు కొట్టాడు. అతని వ్యక్తిగత అత్యధిక పరుగులు 35. రంజీల్లో విదర్భ తరఫున ఆడుతున్నాడు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ తరహాలో వికెట్ కీపర్ బ్యాటర్‌గా సత్తా చాటుతున్నప్పటికీ.. వారిద్దరి స్థాయిలో అవకాశాలు దక్కట్లేదు.