Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత ఆటగాళ్లపై జాతి వివక్ష

Ajay Jadeja
న్యూఢిల్లీ‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు మరో వివాదంలో చిక్కుకుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ లోని విదేశీ సిబ్బంది భారత ఆటగాళ్లపై జాతి వివక్ష చూపుతున్నారని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సంచలన ప్రకటన చేశారు. టోర్మ్ మెంట్ సందర్భంగా ఒక భారత ఆటగాడిపై విదేశీ కోచింగ్ అధికారి ఒకరు జాతి వివక్ష పదజాలం ప్రయోగించాడని ఆయన ఆరోపించారు.

కోల్ కత్తా నైట్ రైడర్స్ లోని విదేశీ ఆటగాళ్లకు, దేశీ ఆటగాళ్లకు మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉందని ఆయన చెప్పారు. ఒక భారత ఆటగాడు తనకు ఈ విషయం చెప్పినట్లు జడేజా తెలిపాడు. తాను భారత అటగాడినని, తనకు కోల్ కత్తా నైట్ రైడర్స్ లోని చాలా మంది ఆటగాళ్లు తనకు తెలుసునని, ఒక భారత ఆటగాడిని మైదానం వెలుపలికి రమ్మని పిలిచారని, దానికి ఆ ఆటగాడు కారణం అడగ్గా యూ ఇండియన్, యూ డూ వాట్ ఐ ఆస్క్ యూ టు డు అని విదేశీ కోచ్ ల్లో ఒకతను అన్నాడని ఆయన వివరించారు. ఆటగాళ్ల మధ్య విభజన రేఖ ఉందని, ఆలోచనా సరళిలోనూ విభజన ఉందని, సౌరవ్ గంగూలీ ఆలోచనా సరళి వేరని ఆయన అన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+