Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆపేయండి: ఫిక్సింగ్ 'వార్త'పై ప్రీతిజింతా షాక్, ఏకేసింది

బెంగళూరు: బాలీవుడ్ నటి, ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింతాకు బుధవారం తీవ్ర ఆగ్రహం వచ్చింది. తన గురించి వచ్చిన ఓ వార్త పైన ఆమె భగ్గుమన్నారు. ఆ వార్త తనను తీవ్ర షాక్‌కు గురి చేసిందని అభిప్రాయపడ్డారు.

తన పైన వచ్చిన వార్తల విషయంలో ఎలాంటి వివరణ అడగకుండానే ఎలా చెబుతారని ఆమె మండిపడ్డారు. తన జట్టుకు చెందిన ఆటగాళ్లు ఫిక్సింగ్‌లో పాల్గొని ఉంటారని ప్రీతి జింతా అనుమానం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

IPL: 'Shocked' Preity Zinta blasts media for 'spreading rubbish'

దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాసేముందు వివరణ అడగరా అని ప్రశ్నించారు. కింగ్స్ ఎలెవన్ జట్టుకు చెందిన కొందరు ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌లో ఉండి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేస్తూ బిసిసిఐకి లేఖ రాసిందని వార్తలు వచ్చాయి.

దీనిపై సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఆమె తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. సెన్షేషన్ కోసం ఆ వార్తలు రాశారన్నారు. వివరణ కోరుకుండా ఇలాంటివి రాయడం ఆపేయాలన్నారు. ఆమె ఇందుకు సంబంధించి ఆరు ట్వీట్లు చేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+