న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధావన్‌ను సొంతం చేసుకోవాలని 3 ఫ్రాంచైజీల పోరాటం

IPL: Shikhar Dhawan talks fail, Delhi Daredevil eye Sunrisers Hyderabad opener

హైదరాబాద్: ఐపీఎల్‌లో ధావన్ కొనసాగడంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. పారితోషకం విషయంలో అసంతృప్తి కారణంగానే వేరే ఫ్రాంచైజీకి మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే వచ్చే ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు శిఖర్ ధావన్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ధావన్‌ను దక్కించుకోవడం కోసం ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఫ్రాంచైజీలు సన్‌రైజర్స్‌తో చర్చలు జరుపుతున్నాయి.

ముందుకొచ్చిన ముంబై ఇండియన్స్

ముందుకొచ్చిన ముంబై ఇండియన్స్

ధావన్ పట్ల పంజాబ్ ఆసక్తి చూపినప్పటికీ.. సొంత ఫ్రాంచైజీ ఢిల్లీ తరఫున అతడు బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తొలుత ధావన్‌ను తీసుకోవడానికి ముంబై ఇండియన్స్ ముందుకొచ్చింది. కానీ పంజాబ్ కూడా ఆసక్తి కనబర్చింది. ఒప్పందం చివరి దశకు రావడంతో.. ధావన్‌ను తీసుకుంటామని పంజాబ్ యాజమాన్యం బీసీసీఐకి కూడా సమాచారం ఇచ్చింది. కానీ ధావన్‌ను జట్టులోకి తీసుకోవడం ద్వారా టాప్ ఆర్డర్‌ను బలోపేతం చేసుకోవాలని ఢిల్లీ భావించింది.

చివరి నిమిషంలో కింగ్స్ ఎలెవన్‌కు నిరాశ

చివరి నిమిషంలో కింగ్స్ ఎలెవన్‌కు నిరాశ

దీంతో ఆ ఫ్రాంచైజీ ఎక్కువ ధరకు బిడ్ వేయడంతో చివరి నిమిషంలో కింగ్స్ ఎలెవన్‌కు నిరాశ ఎదురైంది. ఐపీఎల్ 2018 వేలంలోనూ ధావన్‌ను దక్కించుకునేందుకు పంజాబ్ ప్రయత్నించింది. కానీ ఆర్టీఎం ద్వారా రూ.5.2 కోట్లకు సన్‌రైజర్స్ అతణ్ని అంటిపెట్టుకుంది. మ్యాచ్ ఫీజు పట్ల ఈ లెఫ్ట్ హ్యాండర్ అసంతృప్తితో ఉన్నాడని తెలుస్తోంది.

ఐపీఎల్‌లో మొత్తం 143 మ్యాచ్‌లు ఆడిన ధావన్..

ఐపీఎల్‌లో మొత్తం 143 మ్యాచ్‌లు ఆడిన ధావన్..

గత సీజన్లో ధావన్ సన్‌రైజర్స్ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 16 మ్యాచ్‌ల్లో 38.23 సగటుతో 497 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో మొత్తం 143 మ్యాచ్‌లు ఆడిన ధావన్.. 33.26 యావరేజ్‌తో 4058 రన్స్ చేశాడు.

ఇంకా ధావన్‌ను మరో జట్టుకు అప్పగించలేదు

ఇంకా ధావన్‌ను మరో జట్టుకు అప్పగించలేదు

ధావన్‌కు మంచి డీల్ వర్కౌట్ కాకపోతే.. సన్‌రైజర్స్‌ జట్టులోనే అతడు కొనసాగే అవకాశాలున్నాయి. ‘మేం ధావన్‌ను మరో జట్టుకు అప్పగించలేదు. అతడిని మాతోనే కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ఏం జరుగుతుందో మున్ముందు చూద్దాం'అని సన్‌రైజర్స్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Story first published: Sunday, October 28, 2018, 14:03 [IST]
Other articles published on Oct 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X