IPL Schedule 2022: ఢిల్లీతో మొదలెట్టి ఢిల్లీతోనే ముగింపు.. ముంబై ఇండియన్స్ పూర్తి షెడ్యూల్ ఇదే!

మంబై: అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ ఐపీఎల్ 2022 పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 26న మెగా లీగ్ మొదలై మే 29న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. పది జట్లతో కూడిన ఐపీఎల్‌లో ఈ సారి లీగ్ స్టేజ్‌లోనే 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటితోపాటు 4 ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఐపీఎల్‌లో అత్యధికంగా 5 సార్లు ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్ షెడ్యూల్ గురించి అభిమానులు తెగ ఆరా తీస్తున్నారు. కాగా ఈ సారీ లీగ్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోని 4 స్టేడియాల్లోనే జరగనున్నాయనే సంగతి తెలిసిందే.

ఢిల్లీతోనే మొదటి, చివరి
ఐపీఎల్ 2022లో లీగ్ స్టేజ్‌లో ముంబై ఇండియన్స్ తన వేటను మార్చి 27 నుంచి ప్రారంభించనుంది. మే 21న చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. కాగా ఐపీఎల్‌లో ప్రతి జట్టు లీగ్ స్టేజ్‌లో 14 మ్యాచ్‌లు ఆడుతుందనే సంగతి తెలిసిందే. కాగా ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ను, చివరి మ్యాచ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే ఆడనుండడం గమనార్హం. మార్చి 27న బ్రబౌర్న్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ తన వేటను ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక చివరి మ్యాచ్‌ను మే 21న వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు ఆడనుంది.

కోల్‌కతా, రాజస్థాన్‌తో ఎప్పుడంటే..
ఐపీఎల్ 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 6, మే 9వ తేదీల్లో తలపడనుంది. ఇందులో మొదటి మ్యాచ్‌కు పుణే స్టేడియం అతిథ్యం ఇవ్వనుండగా.. రెండో మ్యాచ్‌కు డివై పాటిల్ స్టేడియం అతిథ్యం ఇవ్వనుంది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా రాత్రి 7:30 గంటలకే ప్రారంభం కానున్నాయి. ఇక రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 2, 30వ తేదీల్లో తలపడనుంది. మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా డివై పాటిల్ స్టేడియంలోనే జరగనున్నాయి.

చెన్నై, లక్నోతో అప్పుడే
కొత్త జట్టైనా లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 16, 24వ తేదీల్లో తలపడనుంది. మొదటి మ్యాచ్ బ్రబౌర్న్ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు, రెండో మ్యాచ్ వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు జరగనున్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 21, మే 12వ తేదీల్లో తలపడనుంది. మొదటి మ్యాచ్ డివై పాటిల్ స్టేడియం వేదికగా, రెండో మ్యాచ్ వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు కూడా రాత్రి 7:30 గంటలకే ప్రారంభం కానున్నాయి.

ఆ జట్లతో ఒక్కో మ్యాచ్
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్‌తో ఒక్కో ముంబై ఇండియన్స్ ఒక్కో మ్యాచ్ ఆడనుంది. ఏప్రిల్ 9న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో, 13న పంజాబ్ కింగ్స్‌తో, మే 6న గుజరాత్ టైటాన్స్‌తో, 17న సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటలకే జరగనున్నాయి. ఇక వేదికలుగా పుణే, బ్రబౌర్న్, వాంఖడే స్టేడియాలు నిలవనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications