న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రిన్సిపాల్ గురునాథ్ మేయప్పన్‌పై ఏం చర్యలు తీసుకున్నారని బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. మంగళవారం స్పాట్ ఫిక్సింగ్‌పై విచారించిన సుప్రీంకోర్టు, దీనిపై శ్రీనివాసన్‌కు మధ్యాహ్నం 2గంటల వరకు గడువు ఇచ్చింది.
సుప్రీం కోర్టు బిసిసిఐకి నాలుగు ఆప్షన్లను ఇచ్చింది
1. శ్రీనివాసన్ పక్కకు తప్పుకోవాలి, బిసిసిఐ కమిటీ మేయప్పన్‌పై చర్యలు తీసుకోవాలి.
2. మేయప్పన్‌కు శిక్ష విధించడాన్ని పర్యవేక్షించేందుకు ఇద్దరు స్వతంత్ర న్యాయమూర్తులను నియమించడం జరుగుతుంది.
3. ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మేయప్పన్ శిక్షపై నిర్ణయం తీసుకుంటుంది.
4. మేయప్పన్‌కు ఏ శిక్ష విధించాలో ముద్గల్ కమిటీ నిర్ణయిస్తుంది.

శ్రీనివాసన్ వల్లే మేయప్పన్‌పై చర్య తీసుకోలేకపోయారని కోర్టు భావించింది. గురునాథ్ మేయప్పన్ చేసిన నేరానికి శిక్షను అనుభవించాల్సిందేనని కోర్టు పేర్కొంది. సోమవారం స్పాట్ ఫిక్సింగ్‌పై విచారించిన సుప్రీంకోర్టు.. స్పాట్ ఫిక్సింగ్ జరిగిన సమయంలో శ్రీనివాసన్ బిసిసిఐ ఛైర్మన్‌గా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమానిగా ఉన్నారని, అతని అల్లుడు గురునాథ్ మాయప్పన్ జట్టు ప్రిన్సిపాల్‌గా ఉన్నాడని తెలిపింది.
అంతేగాక శ్రీనివాసన్‌కు ద్వంద్వ ప్రయోజనాలు లేవని నమ్మెదెలా? అని సుప్రీం ప్రశ్నించింది. శ్రీనివాసన్ అభియోగాలకు అతీతంగా ఉండాల్సిందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆట స్వచ్ఛతను కాపాల్సింది శ్రీనివాసనేని తెలిపింది.