Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నమ్మెదెలా?: శ్రీనివాసన్‌పై సుప్రీం, ఆట స్వచ్ఛతను కాపాడాల్సిందని..

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో వాదనలు విన్న సుప్రీం కోర్టు బిసిసిఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్‌కు చురకలు అంటించింది. స్పాట్ ఫిక్సింగ్ జరిగిన సమయంలో శ్రీనివాసన్ బిసిసిఐ ఛైర్మన్‌గా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమానిగా ఉన్నారని, అతని అల్లుడు గురునాథ్ మాయప్పన్ జట్టు ప్రిన్సిపాల్‌గా ఉన్నాడని తెలిపింది.

అంతేగాక శ్రీనివాసన్‌కు ద్వంద్వ ప్రయోజనాలు లేవని నమ్మెదెలా? అని సుప్రీం ప్రశ్నించింది. శ్రీనివాసన్ అభియోగాలకు అతీతంగా ఉండాల్సిందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆట స్వచ్ఛతను కాపాల్సింది శ్రీనివాసనేని తెలిపింది.

కాగా, డిసెంబర్ 1న శ్రీనివాసన్, అతని తరపు న్యాయవాది కోర్టులో వాదనల సందర్భంగా తమకు ఎలాంటి ఆసక్తి లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం వాదనలు విన్న సందర్భంగా సుప్రీం కోర్టు పై ప్రశ్నలను సంధించింది.

 IPL Scam Hearing: Can N. Srinivasan Disprove Conflict of Interest Charges?

బీహార్ క్రికెట్ సెక్రటరీగా ఉన్న ఆదిత్యాపురి కావాలనే శ్రీనివాసన్‌పై ఆరోపణలు చేస్తున్నారని శ్రీని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బిసిసిఐ ఛైర్మన్ పదవి నుంచే తప్పించేందుకే వారు ఇలాంటి ఆరోపణలు చేశారని చెప్పారు.

ముద్గల్ కమిటీ ముందు గానీ, బాంబే హైకోర్టు ముందుగానీ సమాధానం చెప్పుకునే అవకాశం శ్రీనికి లభించలేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. శ్రీనివాసన్ అమాయకుడని చెప్పారు. బిసిసిఐ స్పాట్ ఫిక్సింగ్‌పై వేసిన కమిటీ కూడా శ్రీనిని నిర్ధోషిగా తేల్చిందని తెలిపారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+