Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎలాగ: మలింగ డూప్‌ని ఫేమస్ చేసిన సచిన్ (వీడియో)

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి వాంఖడె స్టేడియం బయట ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

మ్యాచ్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టు బస్సులో హోటల్ నుంచి స్టేడియానికి చేరుకునే క్రమంలో స్టేడియం బయట ఓ ఫ్యాన్ తన అభిమాని క్రికెటర్‌ను అభినందించడానికి వచ్చాడు. చివరకు తాను అనుకున్నది సాధించాడు.

ఇంతకీ ఎవరా అభిమాని అనుకుంటున్నారు. ఐపీఎల్ పదో సీజన్‌లో ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో అచ్చం శ్రీలంక పేసర్ లసిత్ మలింగ లాగే ఒకతను హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

గురువారం పంజాబ్‌తో‌ మ్యాచ్ ఆడేందుకు వాంఖడె స్టేడియానికి వస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు బస్సుకు అడ్డు తగిలాడు. అంతేకాదు తన చేతిలో పోస్టర్‌తో తన అభిమాని క్రికెటర్‌ను కలవాలంటూ హల్ చల్ చేశాడు.

ఈ మొత్తం తతంగాన్ని బస్సులో నుంచి గమనించిన సచిన్ టెండూల్కర్ వీడియో తీసి తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. 'మాలి బస్సు ఎక్కు, ఈరోజు మనం మ్యాచ్ ఆడాలి' అంటూ కామెంట్ కూడా పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

సచిన్ పోస్టు చేసిన వీడియోలో ఉన్న అతడు అచ్చం మలింగ లాగే పోలికలను కలిగి ఉన్నాడు. రాజ్ కోట్ వేదికగా గుజరాత్ లయన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడిన మ్యాచ్‌లో ఇతడు బాగా హైలట్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం మలింగతో కలిసి దిగిన ఫోటోని ముంబై కోట్ మలింగ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

అయితే గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా మలింగ పోలికలతో ఉన్న అతడు మ్యాచ్‌లో హల్ చల్ చేశాడు. అంతేకాదు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ముంబై ఇండియన్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో 'మలింగ బెస్ట్ ప్రెండ్ ఈరోజు రాత్రి ఇక్కడ ఉన్నాడు' అంటూ ట్వీట్ చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+