న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డే వరల్డ్‌కప్: ఐపీఎల్‌లో ఆర్సీబీ ప్రదర్శన ప్రభావం కోహ్లీపై ఉండదు

IPL 2019 : RCB's Dismal IPL Run Will Have No Bearing On Kohli's Performance in World Cup Says Hogg
IPL run will have no bearing on Virat Kohlis performance in ICC World Cup 2019: Hogg

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) చెత్త ప్రదర్శన ప్రభావం వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఎంతమాత్రం ఉండబోదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్‌ హాగ్‌ అన్నాడు. ఈ సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎంతమాత్రం కలిసి రాలేదు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడటంతో ఆ జట్టు అభిమానులు డీలా పడిపోయారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఆర్సీబీ బౌలింగ్ విభాగం పేలవంగా తయారైంది. భారీ లక్ష్యాలను కూడా కాపాడుకోలేక ఆ జట్టు చేతులెత్తేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు వరుసగా ఆరు మ్యాచ్‌లాడిన ఆర్సీబీ అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.

ఈ నేపథ్యంలో బ్రాడ్ హాగ్ తన ట్విట్టర్‌లో "కోహ్లీ, డివిలియర్స్‌పైనే ఆర్సీబీ అతిగా ఆధారపడుతోంది. ఆర్సీబీ మిడిలార్డర్‌ అనుకున్నంతగా రాణించడం లేదు. డెత్‌ ఓవర్లలో వారి బౌలింగ్‌ పేలవంగా ఉంది. ప్లాన్స్‌ను అనుకున్న విధంగా అమలు చేయడం లేదు. కాబట్టి ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం త్వరగా చర్చించి పరిస్థితుల్లో మార్పు తేవాలి" అంటూ ట్వీట్ చేశాడు.

ఈ సీజన్‌లో ఆర్సీబీ ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకపోవడంపై ఆ జట్టు అభిమానులు సైతం నిరాశలో కూరుకుపోయారు. కాగా, టోర్నీలో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తదుపరి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి మొహాలీలోని పంజాబ్ క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

Story first published: Friday, April 12, 2019, 19:46 [IST]
Other articles published on Apr 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X