

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బోణీ కొట్టింది. జైపూర్ వేదికగా సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 185 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది.
తొలి ఓవర్‌లోనే మూడు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించిన రహానే(27) అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శాంసన్‌తో కలిసి మరో ఓపెనర్ జోస్ బట్లర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే అశ్విన్ బౌలింగ్‌లో బట్లర్(69) వివాదస్పదంగా రనౌటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్(19) ఉన్నంత సేపు మెరుపులు మెరిపించినా.. జట్టును గెలపించలేకపోయాడు. ఛేదనలో జోస్ బట్లర్ (69: 43 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఒకానొక దశలో 148/2తో రాజస్థాన్ రాయల్స్ అలవోకగా గెలిచేలా కనిపించింది.
సంజూ శాంసన్(30) కూడా వెంటనే ఔట్ అవ్వడంతో రాజస్తాన్ పరాజయం ఖరారైంది. అయితే, చివర్లో కేవలం 16 పరుగుల వ్యవధిలో రాజస్థాన్ ఏకంగా 7 వికెట్లు చేజార్చుకుని ఓటమిపాలైంది. పంజాబ్ బౌలర్లలో కర్రన్, ముజీబ్, రాజ్‌పుత్‌లు తలో రెండు వికెట్లు తీశారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
అంతకముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ క్రిస్‌గేల్ (79: 47 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ తొలి ఓవర్‌లోనే కేఎల్ రాహుల్(4) వికెట్‌ను కోల్పోయింది.
దీంతో పవర్‌ప్లే ముగిసే వరకూ నెమ్మదిగా ఆడిన క్రిస్‌గేల్ ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. సర్పరాజ్ ఖాన్‌తో ఇన్నింగ్స్‌ను గేల్ ముందుకు తీసుకెళ్లాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 4, 6 బాదేసి 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. హాఫ్ సెంచరీ అనంతరం గేల్ జోరు పెంచాడు.
బెన్ స్టోక్ వేసిన 16 ఓవర్‌లో ఒక సిక్స్, రెండు ఫోర్లతో గేల్ 18 పరుగులు సాధించాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి భారీ షాట్‌కు యత్నించిన గేల్.. బౌండరీ లైన్ వద్ద రాహుల్ త్రిపాఠీ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఇక, ఆఖరి ఓవర్ వేసిన బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో ఒక ఫోర్, సిక్స్ బాదిన సర్ఫరాజ్ 17 పరుగులు రాబట్టాడు.
దీంతో కింగ్స్ పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు, ధావల్ కులకర్ణి, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ తీసుకున్నారు.