న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హాఫ్ సెంచరీతో చెలరేగిన గేల్: రాజస్థాన్ విజయ లక్ష్యం 185

Gayle

హైదరాబాద్: జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ క్రిస్‌గేల్ (79: 47 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ తొలి ఓవర్‌లోనే కేఎల్‌ రాహుల్‌(4) వికెట్‌ను కోల్పోయింది. దీంతో పవర్‌ప్లే ముగిసే వరకూ నెమ్మదిగా ఆడిన క్రిస్‌గేల్ ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. సర్పరాజ్‌ ఖాన్‌తో ఇన్నింగ్స్‌ను గేల్‌ ముందుకు తీసుకెళ్లాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 4, 6 బాదేసి 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.

ఈ క్రమంలోక్రిస్‌గేల్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరుగుతున్న మ్యాచ్‌లో క్రిస్ గేల్ అత్యంత వేగంగా 4000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. క్రిస్‌గేల్‌ 112 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ఆరు పరుగులు చేయడం ద్వారా క్రిస్‌గేల్.. ఐపీఎల్‌లో 4000 పరుగుల మార్క్‌ని అందుకున్న 9వ క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. అదేవిధంగా ఐపీఎల్‌లో నాలుగు వేల పరుగులు సాధించిన రెండో విదేశీ ఆటగాడిగా గేల్‌ రికార్డు సాధించాడు. గతంలో డేవిడ్‌ వార్నర్‌ ఈ ఘనతను అందుకున్నాడు. ఇక ఈ జాబితాలో డేవిడ్‌ వార్నర్‌(114), విరాట్‌ కోహ్లి(128), సురేష్‌ రైనా, గంభీర్‌(140)లు తర్వాత స్థానాల్లో ఉన్నారు.

హాఫ్ సెంచరీ అనంతరం గేల్‌ జోరు పెంచాడు. బెన్‌ స్టోక్‌ వేసిన 16 ఓవర్‌లో ఒక సిక్స్, రెండు ఫోర్లతో గేల్‌ 18 పరుగులు సాధించాడు. అదే ఓవర్‌ ఆఖరి బంతికి భారీ షాట్‌కు యత్నించిన గేల్‌.. బౌండరీ లైన్‌ వద్ద రాహుల్‌ త్రిపాఠీ క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఇక, ఆఖరి ఓవర్ వేసిన బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో ఒక ఫోర్, సిక్స్ బాదిన సర్ఫరాజ్ 17 పరుగులు రాబట్టాడు.

1
45760

దీంతో కింగ్స్‌ పంజాబ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు, ధావల్ కులకర్ణి, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ తీసుకున్నారు.

Story first published: Monday, March 25, 2019, 22:41 [IST]
Other articles published on Mar 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X