For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపియల్ గొడవపై పిఎంతో రాజీవ్ శుక్లా భేటీ

By Pratap
Rajiv Shukla
న్యూఢిల్లీ: ఐపియల్ వివాదంపై వివరాలను అందజేయడానికి బిసిసిఐ మీడియా, ఆర్థిక కమిటీ చైర్మన్ రాజీవ్ శుక్లా బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్ తో సమావేశమయ్యారు. శశి థరూర్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఐపియల్ వ్యవహారాలపై ప్రధాని వివరాలు అడిగారు. ఆ వివరాలను అందించడానికి రాజీవ్ శుక్లా ప్రధానిని కలిశారు. ఐపియల్ కమిషనర్ గా వైదొలిగే ప్రసక్తి లేదని లలిత్ మోడీ ప్రకటించిన నేపథ్యంలో రాజీవ్ శుక్లా కఠినంగా మాట్లాడారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి బిసిసిఐ వెనకాడబోదని ఆయన అన్నారు. ప్రధానిని కలవడానికి ముందు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

బిసిసిఐ పాలక మండలి ఈ నెల 26వ తేదీన సమావేశం కానుంది. లలిత్ మోడీ భవిష్యత్తుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, శరద్ పవార్ ల మధ్య మంగళవారం జరిగిన సమావేశంలో ఈ నెల 26వ తేదీన జరిగే సమావేశంలో ఏం చేయాలనే విషయంపై సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలని అనుకున్నట్లు ఆయన తెలిపారు. బిసిసిఐ, క్రికెట్ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు. గత 60 ఏళ్లలో బిసిసిఐ ప్రతిష్టపై ఏనాడూ రాజీ పడలేదని, ఇప్పుడు కూడా రాజీ పడబోమని ఆయన అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+