
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2500+ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో మొదటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫునే ఆడుతున్న పంత్ ఇప్పటివరకు 86 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో 34 సగటుతో 2542 పరుగులు చేశాడు. ఇందులో 15 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉండగా.. అత్యధిక స్కోర్ 128 పరుగులుగా ఉంది. ఈ క్రమంలో పంత్ 232 ఫోర్లు, 113 సిక్సులు బాదాడు.
గతంలో అనేక మంది స్టార్ ఆటగాళ్లు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించినప్పటికీ 2500+ పరుగులు ఎవరూ చేయలేదు. ఇక ప్రస్తుతం కెప్టెన్‌గా కూడా ఢిల్లీని రిషబ్ పంత్ విజయవంతంగా నడిపిస్తున్నాడు. తన కెప్టెన్సీలో ఢిల్లీని 2020లో ఫైనల్ చేర్చిన పంత్.. 2021లో ప్లేఆఫ్స్ వరకు తీసుకెళ్లాడు.
ఇక గుజరాత్ టైటన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ 43 పరుగులతో రాణించాడు. మ్యాచ్ మొత్తంలో 29 బంతులు ఎదుర్కొన్న పంత్ 7 ఫోర్లు బాదాడు. అలాగే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా పంత్ నిలిచాడు.

ఇక ఆ మ్యాచ్ విషయానికొస్తే ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో శుభ్‌మాన్ గిల్ 84 పరుగులతో చెలరేగాడు. హార్దిక్ పాండ్యా 31 పరుగులతో పర్వాలేదనిపించగా.. మిల్లర్ 20 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఢిల్లీ బౌలర్లలో ముస్తఫిజర్ రహ్మాన్ 3, ఖలీల్ అహ్మద్ 2, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య చేధనలో ఢిల్లీ 157 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టు బ్యాటర్లలో కెప్టెన్ రిషబ్ పంత్ ఒక్కడే 43 పరుగులతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ 4 వికెట్లతో చెలరేగాడు. షమీ 2, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.