Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Media Rights: సోనీకి కాదు స్టార్‌ స్పోర్ట్స్‌కే టీవీ ప్రసార హక్కులు, వయాకమ్‌కు డిజిటల్ రైట్స్.. !

IPL Rights: Auction Price For Per Match 107.5 Cr & TV Rights For Star Sports, Viacom18

ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియ అత్యంత ఉత్కంఠగా సాగుతోంది. ఇక సోనీ నెట్ వర్క్ టీవీ ప్రసార హక్కులను దక్కించుకుందని వస్తున్న వార్తలు తప్పని తేలింది. ఐపీఎల్ మీడియా హక్కుల ప్యాకేజీ A(ఇండియాలో టీవీ ప్రసార హక్కులు), ప్యాకేజీ B (ఇండియాలో డిజిటల్ ప్రసార హక్కులు) సోమవారం చివరి నిమిషంలో అత్యంత ఉత్కంఠ రీతిలో చేతులు మారినట్లు తెలుస్తోంది. రిలయన్స్‌కు చెందని వయాకామ్ రూ.20,500 కోట్లకు (ప్యాకేజీ B) డిజిటల్ హక్కులను గెలుచుకుంది. దాదాపు సాయంత్రం వరకు టీవీ ప్రసార హక్కులను సోనీ నెట్ వర్క్ గెలుచుకుందంటూ వార్తలు రాగా.. అనూహ్యంగా (ప్యాకేజీ A) హక్కులను డిస్నీ స్టార్ (స్టార్ స్పోర్ట్స్) రూ.23,575కోట్లకు దక్కించుకుందని ఫైనల్‌గా తెలిసింది. ఇక దీంతో 2023 - 2027వరకు 5సీజన్ల పాటు రెండు బ్రాడ్ కాస్టర్లు ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయనున్నాయి.

 వయాకామ్ నుంచి కొత్త యాప్ రానుందా?

వయాకామ్ నుంచి కొత్త యాప్ రానుందా?

వయాకామ్ తన వుట్ యాప్ ద్వారా మ్యాచ్‌లను స్ట్రీమ్ చేయనుందా? లేకుంటే కొత్తగా యాప్ తీసుకొస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక డిస్నీ స్టార్.. తన స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ద్వారా టీవీల్లో లైవ్ ప్రసారం చేయనుంది. ఇక ప్యాకేజీ C 18 ఎక్స్ క్లూజివ్ మ్యాచ్ ల హక్కులను దక్కించుకోవడానికి 1813కోట్లకు పైగా వేలంపాటలో బిడ్డర్లు వేలం వేస్తున్నారు. ఇక ప్యాకేజీ సీ, ప్యాకేజీ డీ వేలంపాట రేపు ఉదయం 11గంటలకు మళ్లీ తిరిగి ప్రారంభం కానుంది. ఇక మొత్తం బీసీసీఐ ప్రసార హక్కుల వేలం ద్వారా 46,000కోట్ల మేర ఆర్జించినట్లయింది. రేపు ఈ విలువ మరింత పెరగనుంది.

 టీవీ, డిజిటల్ హక్కులు కలిపి ఒక్కో మ్యాచ్‌కు 107.5కోట్లు

టీవీ, డిజిటల్ హక్కులు కలిపి ఒక్కో మ్యాచ్‌కు 107.5కోట్లు

ఇక A+B ప్యాకేజీల (టీవీ, డిజిటల్ హక్కులు) ద్వారా బీసీసీఐకి రూ. 44,075 కోట్ల ($5.64 బిలియన్లు) భారీ మొత్తం అందనుంది. ఇక డిజిటల్ హక్కులు ఒక్కో మ్యాచ్‌కు 50కోట్లు పలకగా.. టీవీ ప్రసార హక్కులు ఒక్కో మ్యాచ్‌కు 57.5 కోట్ల మేర పలికింది. దీంతో ఒక్కో మ్యాచ్‌కు 107.5కోట్ల భారీ మొత్తం టీవీ, డిజిటల్ హక్కుల ద్వారా బీసీసీఐకి లభించనుంది. ఇక వచ్చే ఐదేళ్ల పాటు ఐపీఎల్ ప్రసారాన్ని ఇరు బ్రాడ్ కాస్టర్లు చూసుకోవడం ఆసక్తికరంగా మారనుంది. 2వ రోజు వేలం ద్వారా బీసీసీఐకి ఇప్పటివరకు 45,888 కోట్లు వచ్చినట్లు ఖరారైంది. ఇక అన్ని ప్యాకేజీల వేలం ముగిసేసరికి ఎంత మేర బీసీసీఐకి దక్కనుందో తెలియనుంది.

వేలం ముఖ్యాంశాలు

వేలం ముఖ్యాంశాలు

ప్యాకేజీ A - IPL టీవీ ప్రసార హక్కుల ప్యాకేజీ ఒక్కో మ్యాచ్‌కు 57.5కోట్లకు విక్రయం కన్ఫమ్ అయింది. - స్టార్ స్పోర్ట్స్

ప్యాకేజీ B - IPL డిజిటల్ ప్రసార హక్కులు ఒక్కో మ్యాచ్‌కు 50కోట్ల వద్ద విక్రయం కన్ఫమ్ అయింది. - వయాకమ్18

ప్యాకేజీ C - ప్రస్తుతం ఒక్కో మ్యాచ్‌కు 18.5 కోట్లు / విలువ 1818 CR వద్ద టెండర్ నడుస్తుంది. రేపు మళ్లీ వేలం జరగుతుంది.

ప్యాకేజీ D - రేపు పూర్తి వివరాలు తెలుస్తాయి.

Story first published: Monday, June 13, 2022, 20:34 [IST]
Other articles published on Jun 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+