Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Media Rights: టీవీ రైట్స్ సోనీకి, డిజిటల్ రైట్స్ వయాకామ్‌కు.. ఒక్కో మ్యాచ్ 107.5cr

IPL Rights: Auction Price For Per Match 107.5 Cr & TV Rights For Sony, Digital Viacom

ఇండియాలో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారానికి టీవీ, మరియు డిజిటల్ రైట్స్ కోసం రూ.44,075 కోట్ల భారీ ధర లభించింది. బీసీసీఐ ఐపీఎల్ మీడియా రైట్స్ కోసం ఈ-వేలం నిర్వహిస్తుండగా బడా కంపెనీలు బాగా ఆసక్తి కనబరిచాయి. ఇక సోమవారం 2023 - 27 కాలానికి గాను ప్యాకేజీ ఏ (భారత ఉపఖండంలోని టీవీ హక్కులు) రైట్స్ కోసం వేలంలో రూ.23.575కోట్ల భారీ ధర లభించింది. ఇదే కాలానికి సంబంధించిన డిజిటల్ హక్కులు (మొబైల్ బేస్డ్ టెలికాస్టింగ్) రైట్స్ కోసం రూ. 20,500కోట్ల భారీ ధర లభించింది. తద్వారా ఒక్క మ్యాచ్ కాస్ట్ రూ.107.5కోట్లకు చేరకుంది.

ఇక సోనీ టీవీ నెట్ వర్క్ టీవీ రైట్స్ దక్కించుకోగా.. రిలయన్స్-వయాకామ్ జాయింట్ వెంచర్ డిజిటల్ హక్కులను దక్కించుకోనుంది. ఇక కేవలం ఇండియాలోనే ఐపీఎల్ టీవీ మరియు డిజిటల్ ప్రసార హక్కులను విక్రయించడం ద్వారా రాబోయే 5సంవత్సరాల కాలంలో 410మ్యాచ్‌ల కోసం బీసీసీఐకి రూ. 44,075కోట్ల భారీ మొత్తం లభించింది. ఇక ఐపీఎల్లో రాబోయే 3 సీజన్లలో 74మ్యాచ్‌‌లు జరగనుండగా.. నాలుగు, ఐదు సీజన్లలో మ్యాచ్‌ల సంఖ్య 94కు పెరగనుంది. ఇకపోతే ప్యాకేజీ C ( 18 ఎక్స్‌క్లూజివ్ మ్యాచ్‌ల ప్రసారం), ప్యాకేజీ డీ (విదేశాల్లో టీవీ, డిజిటల్ ప్రసార హక్కుల)లకు ఇంకా బిడ్డింగ్ జరగలేదు. మంగళవారం మధ్యాహ్నం వీటికి బిడ్డింగ్ కొనసాగనుంది.

ఇకపోతే 2023-27 సైకిల్‌కి సంబంధించిన ఐపీఎల్ మీడియా హక్కుల మొత్తం విలువ రూ.50,000కోట్లకు చేరుకోవచ్చని తొలుత అంచనా వేసినప్పటికీ.. ప్రస్తుతం వేలం జరుగుతున్న తీరును బట్టి చూస్తుంటే ఈజీగా రూ.60,000కోట్లు దాటేలా ఉంది. ఇకపోతే 2017లో స్టార్ ఇండియా టీవీ, డిజిటల్ హక్కుల కోసం 16,347.5కోట్లు చెల్లించింది. ఈసారి మాత్రం ఐపీఎల్ మీడియా రైట్స్ కోసం అనూహ్యంగా మూడు నుంచి నాలుగింతలు అధికంగా వేలంలో ధర లభిస్తుండడం గమనార్హం. తొలిసారి రైట్స్‌ను నాలుగు ప్యాకేజీల్లో విభజించడం కూడా బీసీసీఐకి కలిసొస్తుంది.

Story first published: Monday, June 13, 2022, 18:17 [IST]
Other articles published on Jun 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+