For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరుదైన రికార్డుకి అడుగుదూరంలో ఆగిపోయిన కోహ్లీ

IPL records Virat Kohli will never break

హైదరాబాద్: ప్లేఆఫ్ కోసం చేస్తున్న సమరంలో బెంగళూరు కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ చాలా ముఖ్యమైంది. దాంతో పాటు అతని మరో చేధించేందుకు కూడా కాస్తంత దూరంలో ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బౌలింగ్ చేసేందుకు ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత రికార్డును సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ ప్రథమస్థానంలో ఉన్నాడు. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విరాట్ కోహ్లీ మొత్తం 162 మ్యాచ్‌లు ఆడి 4,932 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో మరో 68 పరుగులు చేస్తే.. ఐపీఎల్ చరిత్రలో 5వేల పరుగుల మైలురాయిని దాటిని తొలి ఆటగాడిగా విరాట్ నిలిచేవాడు.

ఈ జాబితాలో విరాట్ తర్వాతి స్థానంలో సురేష్ రైనా ఉన్నాడు. ఐపీఎల్ 172 మ్యాచ్‌లు ఆడిన రైనా 4855 పరుగులు చేశాడు. కాగా గత రెండు మ్యాచుల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవం చేసుకోవాలని అనుకుంటుంది. మరోవైపు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటుంది.

ఇలాంటి ఉత్కంఠభరితమైన సమయంలో కోహ్లీ కాస్తంత కంగారుకు లోనైనట్లు కనిపించాడు. ఈ నేపథ్యంలో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో 4.4ఓవర్లో ఫోరు బౌండరీని కొట్టిన కోహ్లీ తర్వాతి బంతికే అవుట్ అయి పెవిలియన్ బాటపట్టాడు. దీంతో అతని తర్వాత మొయిన్ అలీ, డివిలియర్స్ దూకుడుపైనే బెంగళూరు ఆశలు నిలుపుకుంది.

Story first published: Thursday, May 17, 2018, 21:17 [IST]
Other articles published on May 17, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+