న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నన్ను తీసుకుని రాజస్థాన్ పెద్ద రిస్క్ చేసింది: జోఫ్రా ఆర్చర్‌

IPL 2019 : Rajasthan Royals Took Big Risk In Getting Me Says Jofra Archer || Oneindia Telugu
IPL: Rajasthan took a very big risk for having me says Jofra Archer

నేను ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడకున్నా కూడా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం నన్ను వేలంలో తీసుకుంది. ఆ సమయంలో రాజస్థాన్ యాజమాన్యం పెద్ద రిస్క్ చేసింది అని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌ తెలిపారు. కోల్‌కతా వేదికగా గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

బాధగా ఉంది:

బాధగా ఉంది:

మ్యాచ్ అనంతరం జోఫ్రా ఆర్చర్‌ మాట్లాడుతూ... 'చివరి ఓవర్లో బంతి బ్యాట్ మీదకు రావాలని కోరుకున్నా.. అదే జరిగింది. జట్టు సభ్యులను వీడుతున్నందుకు బాధగా ఉంది. టోర్నీ కీలక దశకు చేరుకుంది. ఈ సమయంలో రాజస్థాన్ జట్టుకు ఆడాలని ఉంది, కానీ అది కుదరదు. మా జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత పొందాలని ఆశిస్తున్నా' అని ఆర్చర్‌ పేర్కొన్నారు.

రాజస్థాన్ పెద్ద రిస్క్ చేసింది:

రాజస్థాన్ పెద్ద రిస్క్ చేసింది:

'జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. నా స్థానంలో వారు రాణిస్తారు. ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడకున్నా కూడా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం నన్ను వేలంలో తీసుకుంది. అందుకు వారికి కృతజ్ఞుడను. వేలంలో నన్ను జట్టులోకి తీసుకుని రాజస్థాన్ యాజమాన్యం పెద్ద రిస్క్ చేసింది' అని ఆర్చర్‌ అన్నారు.

ఆర్చర్‌ సంచలన ఇన్నింగ్స్‌:

ఆర్చర్‌ సంచలన ఇన్నింగ్స్‌:

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. రాజస్థాన్ టాప్ బ్యాట్స్‌మన్‌ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఈ కీలక సమయంలో జోఫ్రా ఆర్చర్‌ (12 బంతుల్లో 27 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. చివరి ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ బాది రాయల్స్‌ను విజేతగా నిలిపాడు. అయితే రాజస్థాన్ కొన్ని విజయాలే సాధించినా.. జోఫ్రా ఆర్చర్‌ మాత్రం ఆకట్టుకున్నాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే 6 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. అనంతరం ఆకట్టుకున్నా.. కోల్‌కతాతో మ్యాచ్‌లో మళ్లీ మెరిశాడు. అయితే ప్రస్తుతం జోఫ్రా ఆర్చర్‌ రాజస్తాన్‌ జట్టును వీడి స్వదేశానికి బయలుదేరాడు.

Story first published: Friday, April 26, 2019, 13:48 [IST]
Other articles published on Apr 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X