For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL Qualifier 2: అందుకే బౌలింగ్ ఎంచుకున్న సంజూ శాంసన్, మాకు బ్యాటింగే కావాలన్న డుప్లెసిస్.. సేమ్ టీంలతో

IPl Qualifier 2: Rajasthan Royals have won the toss and have opted to field

ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండో క్వాలిఫయర్‌‌కు రంగం సిద్ధమైంది. సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్, ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో క్వాలిఫయర్‌లో తలపడనున్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఎలిమినేటర్‌లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించి ఆత్మవిశ్వాసంతో రాయల్ ఛాలెంజర్స్ బరిలోకి దిగనుండగా.. క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్ తో భంగపడ్డ రాజస్థాన్ ఈ మ్యాచ్ గెలవడానికి సర్వశక్తులు ఒడ్డడానికి రెడీగా ఉంది. ఇరు జట్లు మ్యాచ్ విన్నర్లను కూడి ఉన్నాయి. ఇకపోతే ఈ సీజన్లోనే అత్యధిక పరుగుల వీరుడు జాస్ బట్లర్, అత్యధిక వికెట్ల ధీరుడు యుజ్వేంద్ర చాహల్ రాజస్థాన్ తరఫున ఆడుతుండగా.. హసరంగా లాంటి మ్యాచ్ టర్నర్ బెంగళూరు వైపు ఉన్నాడు.

ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల కెప్టెన్లు సంజూశాంసన్, ఫాఫ్ డుప్లెసిస్ టాస్ కోసం గ్రౌండ్లోకి వచ్చారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన సంజూ శాంసన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ సీజన్లో అతి తక్కువ టాస్‌లు గెలిచిన సంజూ శాంసన్‌కు కీలక మ్యాచ్‌లో టాస్ గెలవడం కలిసొస్తుందో లేదో మరీ. ఇకపోతే సంజూ శాంసన్ మాట్లాడుతూ.. 'మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. వికెట్ కొంచెం తేమగా ఉంది. మా బౌలింగ్ యూనిట్‌కు ఇది కాస్త ఉపయోగపడేలా ఉంది. అందుకే బౌలింగ్ ఎంచుకున్నా. నిన్న మేము మంచి ప్రాక్టీస్ సెషన్ గేమ్ ఆడాం. అందరం ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం. మా జట్టులో మానసికంగా ప్రతిఒక్కరూ జట్టుకు, ఫ్రాంచైజీకి కనెక్ట్ అయ్యారు. ప్రశాంతంగా ఉంటూ అనవసర విషయాలను పట్టించుకోవడం మానేయడం ముఖ్యం. మా జట్టులో ఎలాంటి మార్పులైతే లేవు.' అని పేర్కొన్నాడు. ఇక టాస్ ఓడిన ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. 'మేము టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలనుకున్నా. లక్కీగా టాస్ ఓడిపోయినా మాకు మేలే జరిగింది. ముందు స్కోరు బోర్డుపై మంచి స్కోరు ఉంచి ప్రత్యర్థిని డిఫెండ్ చేసేలా ప్లాన్ చేసుకున్నాం. నిన్న విశ్రాంతి తర్వాత ఈ రోజు మా టీం అంతా చాలా ఫ్రెష్ నెస్‌తో రెడీగా ఉంది. చాలా పెద్ద స్టేడియంలో ఇంత మంది అభిమానుల ముందు ఆడడానికి ఉవ్విళ్లూరుతున్నాం. ఇక మా జట్టులో ఎలాంటి మార్పులు లేవు.' అన్నాడు.

తుది జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హాజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్, కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్, యుజ్వేంద్ర చాహల్

Story first published: Friday, May 27, 2022, 19:23 [IST]
Other articles published on May 27, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+