|
అసలెందుకు హర్షల్ పటేల్ వర్సెస్ రియాన్ పరాగ్
అసలెందుకు ఈ మ్యాచ్‌లో హర్షల్ పటేల్ వర్సెస్ రియాన్ పరాగ్ అంటే సరిగ్గా ఒక నెల క్రితం ఈ సీజన్లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ టాపార్డర్, మిడిలార్డర్, లోయరార్డర్ విఫలమైన వేళ.. అద్భుత బ్యాటింగ్‌తో రియాన్ పరాగ్ జట్టును ఆదుకున్నాడు. జోష్ హజెల్ వుడ్, హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లలో చూడచక్కని షాట్లు కొట్టాడు. ఇక హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో రియాన్ పరాగ్ వరుసగా మూడు ఫోర్లు కొట్టడమే కాకుండా చివరి బంతికి సిక్సర్ బాది ఇన్నింగ్స్ ముగించాడు. ఆ ఓవర్లో మొత్తం 18పరుగులొచ్చాయి. ఇక సిక్సర్ బాదిన ఆనందంలో పరాగ్ ఏదో అనగా హర్షల్ పటేల్ వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. చిన్నపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది.
|
షేక్ హ్యాండ్ ఇచ్చిన పట్టించుకోని హర్షల్ పటేల్
హర్షల్‌కు సిరాజ్ సైతం జతకూడాడు. ఇంతలో మైదానంలోకి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ సపోర్ట్ స్టాఫ్ వారిద్దరి మధ్య గొడవను సద్దుమణిగించాడు. అయితే సిక్సర్ కొట్టాడనే అసహనంతోనే హర్షల్ పటేల్ రియాన్ పరాగ్‌తో వాగ్వాదానికి దిగాడని కొందరంటుంటే.. రియాన్ పరాగ్ నోరు జారడంతోనే హర్షల్ రియాక్ట్ అయ్యాడని మరికొందరు అన్నారు. ఇక ఈ మ్యాచ్ చివర్లో రియాన్ పరాగ్ షేక్ హ్యాండ్ ఇవ్వబోతే హర్షల్ పటేల్ విసురుగా ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఈ వ్యవహారం సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
|
ఇటీవల రియాన్ పరాగ్ ఓవరాక్షన్ చూస్తుంటే..
అప్పట్లో హర్షల్ పటేల్ దే తప్పన్నట్లు కొందరు వాదించగా.. ఇటీవల రియాన్ పరాగ్ చేస్తున్న ఓవరాక్షన్ చూస్తుంటే అప్పుడు రియాన్ పరాగే కాస్త వేలు పెట్టి గెలికి ఉంటాడంటూ పేర్కొంటున్నారు. ఇక కొందరైతే హర్షల్ పటేల్ వర్సెస్ పాన్ పరాగ్ మధ్య ఎవరిది పైచేయో మరీ అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. ఇక ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఛేదనలో ఆర్సీబీ 115పరుగులకే కుప్పకూలింది.
|
వాళ్లకేమో కోహ్లీ వర్సెస్ బౌల్ట్... ట్రోలర్స్‌కు మాత్రం
ఐపీఎల్ 2022 సీజన్లో రెండో క్వాలిఫయర్ కోసం సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్-ఫాఫ్ డుప్లెసిస్ నాయకత్వాన్ని వహిస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్‌లో చూడదగ్గ మూమెంట్స్గా ట్రెంట్ బౌల్ట్ వర్సెస్ విరాట్ కోహ్లీ, సంజూ శాంసన్ వర్సెస్ హసరంగా అని క్రికెట్ ప్రేమికులు పేర్కొంటుండగా ట్రోలర్స్ మాత్రం హర్షల్ పటేల్ వర్సెస్ పాన్ పరాగ్ (రియాన్ పరాగ్) అంటూ పేర్కొంటున్నారు. మరికొందరు రియాన్ వర్సెస్ హర్షల్ పార్ట్ 2 కోసం వెయిటింగ్ అంటున్నారు.