Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPl Qualifier 1 : మనది కాని టైంలో కొన్నిసార్లు మింగేయాలి.. తప్పదు అన్న జోస్ బట్లర్

Jos Buttler says sometimes we have to swallow our ego while Batting

ఐపీఎల్ 2022 ప్లేఆఫ్స్ క్వాలిఫైయర్ 1మ్యాచ్‌ గుజరాత్ టైటాన్స్‌తో జరగగా రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ మరో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఇక పవర్‌ప్లేలో బట్లర్ కాస్త తడబడ్డాడు. అలాగే లీగ్ దశ ఫస్టాఫ్‌లో రాణించిన బట్లర్ లీగ్ దశ రెండో భాగంలో కొంచెం తన జోరును కోల్పోయాడు. అయినప్పటికీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఇంకా బట్లరే కొనసాగుతున్నాడు. ఇక నిన్నటి మ్యాచ్‌లో క్రీజులో చివరి వరకు ఉన్న బట్లర్ 56బంతుల్లో 12ఫోర్లు, రెండు సిక్సర్లతో 89పరుగులు చేశాడు. తద్వరా రాజస్థాన్ స్కోరుబోర్డుపై మంచి స్కోరు చేసేలా సాయపడ్డాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతను ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద హార్దిక్ పాండ్యా స్లిప్ అయి వదిలేయడంతో ఇక రెచ్చిపోయిన బట్లర్ చివర్లో దూకుడుగా ఆడి జట్టు స్కోరును 188 అయ్యేలా చేశాడు. అయితే 189పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం గుజరాత్ బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్యా అద్భుతమైన భాగస్వామ్యంతో ఛేదించి గుజరాత్ టైటాన్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లారు.

ఇక మ్యాచ్ అనంతరం బట్లర్ మాట్లాడుతూ.. 'నేను ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో కాస్త తడబడ్డ మాట వాస్తవమే. అయితే మరో ఎండ్‌లో సంజూ శాంసన్ ధాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగుపెట్టిస్తుండడంతో నాపై ప్రెషర్ పడలేదు. వీలయినంత వరకు అతనికి స్ట్రైక్‌ ఇవ్వడానికి ప్రయత్నించాను. కాస్త నిలదొక్కుకుంటే నేను రాణించగలనని నాకు తెలుసు. అందుకే నా సహజశైలిలో దూకుడుగా ఆడకుంటా క్రీజులో ఉండాలనే పట్టుదలతో ఆడాను. నాకు అదృష్టం కూడా కలిసొచ్చింది. ఇక చివర్లో పరుగులు రాబట్టడానికి నేను అనుకున్నట్లే వీలయిందని' బట్లర్ తెలిపాడు.

Jos Buttler says sometimes we have to swallow our ego while Batting

'మాకు ఇది చాలా ముఖ్యమైన గేమ్. మొదట బ్యాటింగ్ చేయడం వల్ల మేము స్కోరుబోర్డుపై మంచి స్కోరు ఉంచాలని అనుకున్నాం. అందుకే నేను నా ఇగోను పక్కన పెట్టి వీలయినంత సేపు క్రీజులో ఉండాలని అందుకు అవసరమైతే కొన్ని షాట్లను అవాయిడ్ చేయాలని అనుకున్నాను. అందుకే నా అహాన్ని నేను మింగేశాను. మీకు షాట్లు ఆడడం కష్టమని అనిపించినప్పుడు అనవసరంగా ప్రయత్నించడం కన్నా నిలదొక్కుకోవడానికి ప్రయత్నించడమే మంచింది. అదే నేను చేశాను. నాకు టైం వస్తుందని నమ్మకంగా నిలబడ్డా. అప్పుడు అనుకున్నట్లుగానే నేను హిట్టింగ్ చేయగలిగాను' అని బట్లర్ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, May 25, 2022, 15:23 [IST]
Other articles published on May 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+