After 23 Matches: పాయింట్ల పట్టిక, అరెంజ్, పర్పుల్ క్యాప్ ఎవరి సొంతం!

హైదరాబాద్: చెపాక్ వేదికగా మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతా నిర్దేశించింన 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. చెన్నై బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ డుప్లెసిస్ 45 బంతుల్లో43(3 ఫోర్లు) చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

దీపక్ చాహర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు
ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన సీఎస్‌కే పేసర్ దీపక్ చాహర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 23 మ్యాచ్‌లు ముగిశాయి. ఈ నేపథ్యంలో పాయింట్ల పట్టికతో పాటు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్‌లను ఏయే ఆటగాళ్లు సొంతం చేసుకున్నారో ఒక్కసారి చూద్దాం....

2019 ఐపీఎల్ పాయింట్ల పట్టిక
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించి 10 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ కూడా 8 పాయింట్లు సాధించినప్పటికీ... నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇక, 6 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది.

ఆరెంజ్ క్యాప్
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ దగ్గర ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన డేవిడ్ వార్నర్ 349 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో జానీ బెయిర్ స్టో(263 పరుగులు), ఆండ్రీ రస్సెల్(257) ఉన్నారు.

పర్పుల్ క్యాప్
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి ఇచ్చే పర్పుల్ క్యాప్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన రబాడ 11 వికెట్లు తీశాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఇమ్రాన్ తాహిర్(9), యజువేంద్ర చాహాల్(9) ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications