Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్లేఆఫ్ రేసులో మిగిలేది.. ఆ 4 జట్లే, దాదాపు పంజాబ్ ఔట్

IPL Points Table 2018, Purple and Orange Cap Holders

హైదరాబాద్: పోటీ తగ్గింది. ప్లేఆఫ్ రేసులో నిలిచే జట్లు కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన ఐపీఎల్ అభిమానులకు శనివారం సగం సమాధానం దొరికేసింది. దీంతో ఐపీఎల్‌-11లో ఒకే రోజు రెండు జట్ల భవితవ్యం తేలిపోయింది. చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై ఘనవిజయం సాధించడం ద్వారా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేఆఫ్‌ బెర్తును ఖరారు చేసుకుంది. మరోవైపు రాజస్థాన్‌ చేతిలో షాక్‌ తిన్న బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

రెండు మ్యాచ్‌లతో ఆఖరి బెర్తు లెక్క

రెండు మ్యాచ్‌లతో ఆఖరి బెర్తు లెక్క

చివరి బెర్తు కోసం మూడు జట్లు బరిలో నిలిచాయి. లీగ్‌ దశ చివరి రోజైన ఆదివారం జరిగే రెండు మ్యాచ్‌లతో ఆఖరి బెర్తు లెక్క తేలిపోతుంది. సాయంత్రం ఢిల్లీతో ముంబై, రాత్రి చెన్నైతో పంజాబ్‌ తలపడనున్నాయి. ముంబై.. ఢిల్లీని ఓడిస్తే ఉత్కంఠకు తెరపడినట్లే. అది ముంబైకి ఏడో విజయం అవుతుంది. అదే క్రమంలో చెన్నైని పంజాబ్‌ ఓడించినా ఫలితం ఉండదు.

ముంబై, రాజస్థాన్‌, పంజాబ్‌ ఏడేసి విజయాలతో

ముంబై, రాజస్థాన్‌, పంజాబ్‌ ఏడేసి విజయాలతో

ముంబై, రాజస్థాన్‌, పంజాబ్‌ ఏడేసి విజయాలతో సమమవుతాయి. కానీ నెట్‌రన్‌రేట్‌లో ముంబై (0.384) ముందుంది. ముంబై గెలవగానే ముందు రాజస్థాన్‌ (నెట్‌ రన్‌రేట్‌ -0.250) నిష్క్రమిస్తుంది. -0.490 నెట్‌రన్‌రేట్‌తో ఉన్న పంజాబ్‌ ఎంత భారీగా గెలిచినా ముంబైని దాటడం కష్టం కాబట్టి ఆ జట్టూ నిష్క్రమించినట్లే. రోహిత్‌ సేన ముందుకెళ్లినట్లే.

ముంబై సాయంత్రం ఓడిపోతే

ముంబై సాయంత్రం ఓడిపోతే

అలా కాకుండా ముంబై సాయంత్రం ఓడిపోతే.. అప్పుడు రాజస్థాన్‌, పంజాబ్‌ మధ్య పోటీ నెలకొంటుంది. రాత్రికి పంజాబ్‌.. చెన్నైపై భారీ విజయం సాధించి నెట్‌రన్‌రేట్‌లో రాజస్థాన్‌ను అధిగమిస్తే ముందంజ వేస్తుంది. ఆ జట్టు ఎంత తేడాతో గెలవాలన్నది ముందే తేలిపోతుంది. ఒకవేళ పంజాబ్‌ గెలిచినా నెట్‌రన్‌రేట్‌లో అధిగమించలేకపోతే లేదా ఆ మ్యాచ్‌ ఓడితే రాజస్థాన్‌ ముందంజ వేస్తుంది.

 పంజాబ్‌ చేతిలో చెన్నై ఎక్కువ తేడాతో ఓడితే

పంజాబ్‌ చేతిలో చెన్నై ఎక్కువ తేడాతో ఓడితే

ఐపీఎల్‌-11లో ఓవైపు చివరి ప్లేఆఫ్‌ బెర్తు ఎవరిదనే ఉత్కంఠ ఓవైపు.. అలాగే తొలి రెండు స్థానాలు ఎవరివనే ఆసక్తి మరోవైపు. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ 9 విజయాలు, 0.284 నెట్‌రన్‌రేట్‌తో అగ్రస్థానంలో ఉంది. చెన్నై (8 విజయాలు, 0.220 నెట్‌రన్‌రేట్‌)ది రెండో స్థానం. ఆదివారం పంజాబ్‌పై చెన్నై ఓ మోస్తరు తేడాతో గెలిచినా సన్‌రైజర్స్‌ను వెనక్కి నెట్టొచ్చు. ఐతే టాప్‌-2లో నిలిచిన రెండు జట్లకు ప్లేఆఫ్స్‌లో రెండో అవకాశం ఉంటుంది కాబట్టి సన్‌రైజర్స్‌కు నష్టమేమీ లేదు. పంజాబ్‌ చేతిలో చెన్నై ఎక్కువ తేడాతో ఓడితే కోల్‌కతా (-0.250) రెండో స్థానానికి చేరుకుంటుంది.

Story first published: Sunday, May 20, 2018, 11:56 [IST]
Other articles published on May 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+