For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్నానం చేస్తూనే.. కోల్‌కతా జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన షారూక్(వీడియో)

IPL Playoffs: Shah Rukh Khans Message For His Team KKR, From The Shower. Believe It.

హైదరాబాద్: ప్లేఆఫ్ రేసులో నిలిచి రాజస్థాన్‌ను గెలిచిన జట్టుగా కోల్‌కతా విజయోత్సాహంలో ఉంది. బుధవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై గెలిచి సత్తా చాటింది. ఈ విజయానికి ముగ్దుడైన జట్టు యజమాని షారూక్ ఖాన్ స్నానం చేస్తుండగానే ఆలస్యం చేయకూడదనే ఉద్దేశ్యంతో అలాగే వీడియో సందేశం పంపాడు. తాను అందరితో మాట్లాడాలని ఉన్నా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇలా కోల్‌కతా జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ పేర్కొన్నాడు.

బాలీవుడ్ బాద్ షా షారూక్ చేసిన ట్వీట్‌లో.. జట్టు ఆటగాళ్లను చాలా మిస్సవుతున్నా.. షూటింగ్‌కు బయల్దేరాల్సి ఉండడంతో స్నానం చేస్తున్నా. తప్పని పరిస్థితుల్లో శుభాకాంక్షలు ఇలా తెలుపుతున్నా' అంటూ ట్విట్టర్ అకౌంట్ ద్వారా సందేశాన్ని పంపాడు.

దినేశ్‌ కార్తీక్‌ 38 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సులతో(52), ఆండ్రీ రసెల్‌ 25 బంతుల్లో 3ఫోర్లు, 5 సిక్సులతో(49) మెరవడంతో మొదట కోల్‌కతా 7 వికెట్లకు 169 పరుగులు సాధించింది. ఛేదనలో ఆరంభంలో అద్భుతంగా రాణించినా..రాజస్థాన్‌ అనూహ్యంగా తడబడింది.

కుల్‌దీప్‌ యాదవ్‌ (1/18), పియూష్‌ చావ్లా (2/24), ప్రసిద్ధ్‌ కృష్ణ (1/28) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో రాజస్థాన్‌ 4 వికెట్లకు 144 పరుగులే చేయగలిగింది. సంజు శాంసన్‌ (50), రహానె (46) రాణించారు. 25 బంతుల్లో 49 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఆండ్రీ రసెల్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Story first published: Thursday, May 24, 2018, 13:45 [IST]
Other articles published on May 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+