Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Playoffs: KKR చేతిలో గుజరాత్ ఓడితే పరిస్థితేంటి?

ఐపీఎల్-2024లో ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠగా సాగుతోంది. మ్యాచ్ మ్యాచ్‌కు సమీకరణాలు మారిపోతున్నాయి. అంచనాలను తలకిందులు చేస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా అయిదు విజయాలు సాధించి పోటీలోకి దూసుకొచ్చింది. రాజస్థాన్ రాయల్స్‌కు షాక్ ఇచ్చి చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకుంది.

మరోవైపు కోల్‌కతా నైట్ నైడర్స్ తుదిపరి దశకు అర్హత సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌ సేఫ్ జోన్‌లో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ భవిష్యత్తు తమ చేతుల్లోనే ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లో గెలిస్తే ఎస్‌ఆర్‌‌హెచ్‌కు తిరుగుండదు. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తమ విజయాలతో పాటు నెట్‌రన్‌రేటుపై అతిగా ఆధారపడాల్సి ఉంది.

IPL playoffs scenario What if Gujarat Titans loses to KKR

అయితే గుజరాత్ టైటాన్స్‌ది భిన్నమైన పరిస్థితి. ప్రతి పోరు తమకు డూ ఆర్ డై మ్యాచే. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ అయిదు విజయాలతో పది పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. ఈ రెండింట్లో విజయం సాధిస్తే గుజరాత్ 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో పోటీలో ఉంటుంది.

విజయాలతో పాటు నెట్ రన్ ‌రేటును గుజరాత్ గణనీయంగా మెరుగుపర్చుకోవాలి. ప్రస్తుతం గుజరాత్ నెగిటివ్ రన్‌రేటులో (-1.063) ఉంది. అయితే ఇవాళ కేకేఆర్‌తో జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్ ఓటమిపాలైతే ఇంటిముఖం పట్టాల్సిందే. ఎలా అంటే.. ఒకవేళ గుజరాత్ కేకేఆర్ చేతిలో ఓడి సన్‌రైజర్స్‌పై గెలిస్తే గరిష్టంగా 12 పాయింట్లే సాధిస్తుంది. ఇప్పటికే 12 పాయింట్ల కంటే అధికంగా నాలుగు టీమ్స్ పాయింట్లు సాధించాయి.

కోల్‌కతా 18, రాజస్థాన్ 16, సీఎస్కే 14, హైదరాబాద్ 14 పాయింట్లు సాధించాయి. దీంతో గుజరాత్ ఈ పాయింట్లను అధిగమించడం అసంభవం. ఈ నేపథ్యంలో ఇవాళ కేకేఆర్‌పై తప్పక విజయం సాధించాలి. ఒకవేళ ఓటమిపాలైతే ఐపీఎల్ 2024 సీజన్‌లో నాకౌటైన మూడో జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలుస్తుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.

Story first published: Monday, May 13, 2024, 18:57 [IST]
Other articles published on May 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+