Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్లేఆఫ్స్ రేస్ - IPL చరిత్రలో ముందుగా నిష్క్రమించిన జట్లు ఇవే..

IPL: ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ సీజన్‌లో చెన్నై మిగిలి ఉన్న అన్ని మ్యాచ్ లు గెలిచినా గరిష్టంగా 12 పాయింట్లను చేరుకోగలదు. 12 పాయింట్లతో 10 జట్లు ఉన్న టోర్నమెంట్ లో టాప్-4 స్థానాల్లో కొనసాగడం సాధ్యం కాదు. అందుకే ఈ సీజన్‌లో చెన్నై జట్టు మొదట ఎలిమినేట్ కావడానికి ఇదే కారణం. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించడం ఇది రెండో సారి మాత్రమే.

సీఎస్కే గురించి చెప్పాలంటే.. 2025కి ముందు 2020 టోర్నమెంట్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి మొదటగా నిష్క్రమించింది. ఈ రెండు సార్లు మాత్రమే సీఎస్కే ప్లేఆఫ్స్ రేసు నుంచి వెళ్లిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్, డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ జట్లు అత్యధికంగా 3 సార్లు ముందుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి వెళ్లిపోయాయి. ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు వరుసగా రెండు సార్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. వీటితో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్, పుణె వారియర్స్ ఇండియా, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ సీజన్ లో ఒక్కొక్కసారి మొదట ఎలిమినేట్ అయ్యాయి. ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్ నుంచి మొదట నిష్క్రమించిన జట్ల గురించి తెలుసుకుందాం.

IPL Playoffs Race Teams Eliminated Early in IPL History

ఐపీఎల్ నుంచి ముందుగా ఎలిమినేట్ అయిన జట్లు ఇవే.. (2008 నుంచి 2025 వరకు)

2008 - డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్

2009 - కోల్‌కతా నైట్ రైడర్స్

2010 - పంజాబ్ కింగ్స్

2011 - డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్

2012 - డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్

2013 - పుణె వారియర్స్ ఇండియా

2014 - ఢిల్లీ క్యాపిటల్స్

2015 - పంజాబ్ కింగ్స్

2016 - రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్

2017 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

2018 - ఢిల్లీ క్యాపిటల్స్

2019 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

2020 - చెన్నై సూపర్ కింగ్స్

2021 - సన్‌రైజర్స్ హైదరాబాద్

2022 - ముంబై ఇండియన్స్

2023 - ఢిల్లీ క్యాపిటల్స్

2024 - ముంబై ఇండియన్స్

2025 - చెన్నై సూపర్ కింగ్స్

Story first published: Thursday, May 1, 2025, 15:43 [IST]
Other articles published on May 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+