ఐపీఎల్-2024లో ప్రీక్లైమాక్స్ ఫైట్ మొదలైంది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం కోసం అన్ని జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఇప్పటికే 16 పాయింట్లు సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తదుపరి దశకు చేరుకోవడం దాదాపు ఖాయమైంది.అయితే అంతిమంగా టాప్-2లో నిలవాలని కేకేఆర్, ఆర్‌ఆర్ భావిస్తున్నాయి.
పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే ఫైనల్‌కు చేరుకోవడానికి అదనపు అవకాశం లభించనుండటంతో మిగిలిన మ్యాచ్‌లను కూడా కోల్‌కతా, రాజస్థాన్ సీరియస్‌గా తీసుకోనున్నాయి. అయితే మిగిలిన రెండు స్థానాల కోసమే అసలు పోటీ మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలో 12 పాయింట్లతో సమానంగా ఉన్నాయి.

కానీ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో పాయింట్ల పట్టికలో లక్నోపైన సీఎస్కే, ఎస్‌ఆర్‌హెచ్ వరుసగా ఉన్నాయి. అయితే ఈ మూడు జట్లలో సన్‌రైజర్స్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే చెన్నై, లక్నో ఇప్పటికే 11 మ్యాచ్‌లు ఆడాయి. కానీ హైదరాబాద్ 10 మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. ఇవాళ వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌ను ఎదుర్కోనుంది. ఈ పోరులో ముంబైపై ఎస్‌ఆర్‌హెచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగైనట్లే.
ఒకవేళ ముంబై చేతిలో ఓటమిపాలైతే సన్‌రైజర్స్ పరిస్థితేంటని ఆరెంజీ ఆర్మీలో ఆందోళన పెరిగింది. అయితే అనుకోకుండా ఓటమిపాలైనప్పటికీ తెలుగు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగ్గానే ఉంటాయి. ఎలా అంటే తర్వాత జరగనున్న మూడు మ్యాచ్‌లను ఎస్‌ఆర్‌హెచ్ సొంతమైదానం అయిన ఉప్పల్ స్టేడియంలోనే తలపడనుంది. సొంతగడ్డపై ఆడటం హైదరాబాద్‌కు కచ్చితంగా అదనపు బలాన్ని చేకూరుస్తోంది.
ముంబైపై గెలవకపోయినా ఉప్పల్‌లో జరగనున్న మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలిచినా 16 పాయింట్లతో మెరుగైన నెట్‌రన్‌రేటుతో సులభంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అంతేగాక మిగిలిన మ్యాచ్‌ల్లో తలపడే లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లతో పోలిస్తే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎస్‌ఆర్‌హెచ్ ఎంతో బలమైనది. దీంతో మన తెలుగు జట్టు ఈసారి ప్లేఆఫ్స్‌కు వెళ్లడం దాదాపు ఖాయమే.