For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018 ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్: కోహ్లీ, రోహిత్‌కు 17, ధోనికి రూ.15 కోట్లు

By Nageshwara Rao

హైదరాబాద్: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2018 సీజన్ ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్ ప్రారంభమైంది. ముంబైలోని తాజ్ ఎండ్స్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రాంఛైజీలు తమ నివేదికలను ఐపీఎల్ నిర్వాహకులకు అందజేశాయి. దీనికి సంబంధించిన విషయాలు మీకోసం.....

ప్రాంఛైజీలు విడుదల చేసిన ఆయా ఆటగాళ్ల నుంచి వేలం సమయంలో రైటు టు మ్యాచ్‌ ద్వారా అందులో నుంచి కొంతమంది ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ రిటెన్షన్‌ ప్రాసెస్ 2018 నుంచి 2020 వరకూ అంటే మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది.


ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్‌లో భాగంగా అట్టిపెట్టుకున్న ఆటగాళ్లకు ప్రాంఛైజీలు పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నాయి. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు రూ. 17 కోట్లు చెల్లించారు. మరోవైపు చెన్నై ఫ్రాంచైజీ ధోనికి రూ. 15 కోట్లు చెల్లించింది.


ఇక, ఐపీఎల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ స్టేజి పైకి వచ్చాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆటగాడు, ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో పాటు పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను అట్టిపెట్టుకుంది.


ఇక, ఐపీఎల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం స్టేజిపైకి వచ్చింది. ఈ క్రమంలో ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌లను అట్టిపెట్టుకుంది. మరోవైపు ఆర్సీబీ అనూహ్యంగా సర్ఫరాజ్ ఖాన్‌ను కూడా జట్టులోకి తీసుకుంది.


ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్‌లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ గౌతం గంభీర్‌కు హ్యాండ్ ఇచ్చింది. ఆ ఫ్రాంచైజీ కేవలం ఇద్దరు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. అందులో వెస్టిండిస్ స్పిన్నర్ సునీల్ నరేన్, ఆండ్రూ రస్సెల్‌లు ఉన్నారు.

ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్‌లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ దక్షిణాప్రికా బ్యాట్స్‌మెన్ క్రిస్ మోరిస్, ఢిల్లీ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌ను అట్టిపెట్టుకుంది. ఇక, కింగ్ ఎలెవన్ పంజాబ్ జట్టు అక్షర పటేల్‌ను అట్టిపెట్టుకుంది.


ఐపీఎల్ 2018 ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్‌లో ఎనిమిది ప్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలిలే. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని ఆ జట్టుకే చెందగా, అనూహ్యంగా సర్ఫరాజ్ ఖాన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తీసుకుంది.


ముంబై జట్టు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్యా

రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కొని ఐపీఎల్ 2018లో తిరిగి పునరాగమనం చేస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్‌ రాయల్స్ జట్టు విషయంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిబంధనలను సడలించాయి. ఈ రెండు జట్లు 2015 ఐపీఎల్ ఆధారంగా ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఐపీఎల్ 2018 కోసం అసలైన ఆటగాళ్ల వేలం జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరులో జరగనుంది.


Salary Cap

2018: Rs 80 crore

2019: Rs 82 crore

2020: Rs 85 crore

Minimum spend: 75 per cent of the salary cap.

Player Retention Price Guideline

Option 1


3 players retained pre- auction

Salary Cap

Player 1: Rs 15 cr

Player 2: Rs 11 cr

Player 3: Rs 7 cr


Option 2

2 players retained pre-auction

Salary Cap

Player 1: Rs 12.5 cr

Player 2: Rs 8.5 cr


Option 3

1 player retained pre-auction

Salary Cap

Player 1: Rs 12.5 cr


Uncapped players INR 3 crore per player.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 4, 2018, 21:56 [IST]
Other articles published on Jan 4, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+