
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభానికి ముందే అనేక రికార్డులు బద్దలు కొడుతోంది. జనవరి 4న ముంబై వేదికగా జరిగిన ప్లేయర్ రిటెన్షన్ ఈవెంట్‌ను గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి స్టార్ నెట్‌వర్క్ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ ఈవెంట్‌ని కూడా వీక్షకులు రికార్డు స్థాయిలో వీక్షించినట్లు బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) వెల్లడించింది. 8.1 మిలియన్ల మంది టీవీ, డిజిటల్ ఫార్మాట్స్ ద్వారా ఈ ఈవెంట్‌ను వీక్షించినట్లు బార్క్ వెల్లడించింది.
ముఖ్యంగా టెలివిజన్ల ద్వారా 4.1 మిలియన్ల మంది వీక్షకులు వీక్షించగా.. డిజిటల్ ప్లాట్‌ఫాం హాట్‌స్టార్ ద్వారా 4 మిలియన్ల మంది తిలకించారని బార్క్ ప్రతినిధులు అధికారిక ప్రకటన చేశారు. స్టార్ ఇండియా టెలివిజన్ నెట్‌వర్క్‌కు చెందిన స్టార్ స్పోర్ట్స్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రాంఛైజీలు ఎవరెవరిని తమ వద్ద అట్టిపెట్టుకున్నాయనే విషయాన్ని ఐపీఎల్ నిర్వహకులకు తెలియజేశాయి. ఐపీఎల్ 2018 సీజన్‌లో భాగంగా జరిగిన తొలి ఈవెంట్ ఇది. దీంతో తన అభిమాన క్రికెటర్ అదే జట్టుకు ఆడతాడా లేదా వేలానికి వెళతాడా అన్న ఆసక్తితో అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ ప్లేయర్ రిటెన్షన్ ఈవెంట్‌ని వీక్షించడం జరిగింది.
కాగా, ఐపీఎల్ 11వ సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఉన్నారు. ఈ సీజన్‌కు సంబంధించి జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎమ్) ద్వారా ఎవరిని తిరిగి సొంతం చేసుకోవాలి, వేలంలో ఎవర్ని వేలంలో కొనుగోలు చేయాలనే దానిపై ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.