For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్ 2018: సాయంత్రం 7 గంటలకు ఏ ప్లేయర్ ఏ జట్టులో!

By Nageshwara Rao
 IPL Player Retention 2018: Date, Time, Live TV broadcast and online streaming

హైదరాబాద్: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2018 సీజన్ ఆరంభానికి ముందే సరికొత్త పుంతులు తొక్కుతుంది. ఏ జట్టులో ఎవరెవరు ఆటగాళ్లు ఉంటారో.. వేలానికి ఎవరు వెళతారో అన్న దానిపై గురువారం తెలియనుంది. ముంబైలోని తాజ్ ఎండ్స్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రాంఛైజీలు తమ నివేదికలను అందజేయనున్నాయి.

ఈ కార్యక్రమాన్ని స్టార్స్ స్పోర్ట్స్ సాయంత్రం 7 గంటలకు ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంఛైజీలు తమ వద్ద అట్టిపెట్టుకునే ఆటగాడి వివరాలను నివేదిక రూపంలో అందజేయనున్నాయి. ఈ కార్యక్రమం కోసం క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఐపీఎల్‌లోని అన్ని ఫ్రాంఛైజీలు ఎవర్ని తిరిగి తమ జట్టులోకి తీసుకోవాలి.. ఏయే ఆటగాడిని రైట్‌ టు మ్యాచ్‌ కార్డు ద్వారా ఎంచుకోవాలన్న దానిపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాయి. ఐపీఎల్ 10 సీజన్లు ముగిసిన నేపథ్యంలో అందరూ ఆటగాళ్లు వేలంలోకి రావాల్సి ఉంది.

అయితే ప్రాంఛైజీల కోరిక మేరకు ముగ్గురు లేదా ఐదుగురు ఆటగాళ్లను తమ వద్దే అట్టిపెట్టుకునే వెసులు బాటుని ఐపీఎల్ నిర్వాహకులు కల్పించారు. ఇందులో ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుని మరో ఇద్దర్ని రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎమ్‌) కార్డు ద్వారా తిరిగి అదే జట్టుకు ఆడేలా నిబంధనలు విధించారు.

ఏ ఏ జట్లు ఎవరెవరిని తమ వద్ద అట్టిపెట్టుకున్నాయంటే:
* ముంబై ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్యా
* చెన్నై సూపర్‌కింగ్స్‌: మహేంద్ర సింగ్‌ ధోనీ, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా (సందిగ్ధత నెలకొంది)
* కోల్‌కతా నైట్‌రైడర్స్‌: క్రిస్‌ లిన్‌
* సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, శిఖర్‌ ధావన్‌.(ఆర్‌టీఎమ్ ద్వారా దీపక్‌ హుడా)
* ఢిల్లీ డేర్‌డెవిల్స్‌: రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌.
* రాజస్థాన్‌ రాయల్స్‌: స్టీవ్‌ స్మిత్‌
* కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌: గ్లెన్ మ్యాక్స్‌వెల్‌
* రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, చాహల్‌

రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కొని ఐపీఎల్ 2018లో తిరిగి పునరాగమనం చేస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్‌ రాయల్స్ జట్టు విషయంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిబంధనలను సడలించాయి. ఈ రెండు జట్లు 2015 ఐపీఎల్ ఆధారంగా ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఐపీఎల్ 2018 కోసం అసలైన ఆటగాళ్ల వేలం జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరులో జరగనుంది.

Salary Cap

2018: Rs 80 crore

2019: Rs 82 crore

2020: Rs 85 crore

Minimum spend: 75 per cent of the salary cap.

Player Retention Price Guideline

Option 1


3 players retained pre- auction

Salary Cap

Player 1: Rs 15 cr

Player 2: Rs 11 cr

Player 3: Rs 7 cr


Option 2

2 players retained pre-auction

Salary Cap

Player 1: Rs 12.5 cr

Player 2: Rs 8.5 cr


Option 3

1 player retained pre-auction

Salary Cap

Player 1: Rs 12.5 cr


Uncapped players INR 3 crore per player.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 4, 2018, 12:15 [IST]
Other articles published on Jan 4, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+