Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

465 లక్షల మంది..: ఐపీఎల్ లో మరో కొత్త రికార్డు

IPL player auction attracts 46.5 million viewers on Star Sports

హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ మొదలైపోయింది. క్రీడాకారుల వేలంతోనే దాదాపు సీజన్ ప్రారంభమైనట్లే. ఇప్పటికే ఐపీఎల్ అభిమానులు వేలాన్ని దాదాపు 4 కోట్ల 65 లక్షల మంది చూస్తూ ఉండిపోయారట. ఈ విషయాన్ని ఐపీఎల్ ప్రసార హక్కులు సొంతం చేసుకున్న స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వెల్లడించింది.

2018 సీజన్‌కు గాను జనవరి 4వ తేదీ బీసీసీఐ రిటెన్షన్ జాబితాను విడుదల అయింది. అదే నెల 27, 28 తేదీల్లో బెంగుళూరు వేదికగా ఐపీఎల్ వేలాన్ని నిర్వహించింది. ఈ రెండు కార్యక్రమాలు నిర్వహించిన రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో టాప్‌లో నిలిచాయి.

ఈ వేలంలో పాల్గొన్న 8 ఫ్రాంచైజీలు తమ జట్టుకు సరిపడ ఆటగాళ్లను ఎంచుకుని మరీ కొనుగోలు చేసుకున్నాయి. తాజాగా బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌(బార్క్‌) ఐపీఎల్‌ వేలాన్ని ఎంతమంది ప్రత్యక్షంగా వీక్షించారో ప్రకటించింది.

స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఐపీఎల్‌ వేలాన్ని అభిమానులు పెద్ద సంఖ్యలో వీక్షించారు. 'ఈ ఏడాది జనవరి 27, 28 తేదీల్లో నిర్వహించిన ఐపీఎల్‌ వేలానికి విశేష స్పందన వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వీక్షకుల సంఖ్య బాగా పెరిగింది. సుమారు 46.5మిలియన్ల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది ఐదు రెట్లు అధికం. స్టార్‌ స్పోర్ట్స్‌‌ నెట్‌వర్క్‌లోని ఆరు ఛానెళ్లల్స్‌లో ఇది ప్రసారమైంది' అని బార్క్‌ అధికారులు తెలిపారు.

ఐపీఎల్ లో పాల్గొనే క్రీడాకారుల గడువు పది సంవత్సరాలే. దీంతో వారి గడువు కాలం ముగియడంతో అన్ని జట్లు వారి ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఐపీఎల్‌ 11వ సీజన్‌ ఏప్రిల్‌ 7న ముంబైలో ప్రారంభంకానుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, February 9, 2018, 12:58 [IST]
Other articles published on Feb 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+