For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ వేలం: గేల్‌పై కనికరం చూపిన ప్రీతి జింతా.. ధరెంతో తెలుసా..?

IPL Player Auction 2018: Chris Gayle, Unsold Twice, Bought By Kings XI Punjab For Rs 2 Crore

హైదరాబాద్: విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ ఐపీఎల్ వేలంలో రెండు రౌండ్లలో కొనుగోలు కాలేదు. చివరకి మూడో రౌండ్ వేలానికి రావడంతో ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. చివరికి పంజాబ్ జట్టు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ప్రీతి జింతా అతనిపై 2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ప్రారంభ ధరకి మించి ఒక్క రూపాయి కూడా గేల్‌కు కేటాయించదలచలేదు.

ఆదివారం అన్‌సోల్డ్‌ వేలం పాటలో భాగంగా తొలుత గేల్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. కాగా, అమ్ముడుపోని క్రికెటర్లకు ఆఖర్లో మరొకసారి వేలం జరగ్గా గేల్‌ను కొనుగోలు చేయడానికి కింగ్స్‌ పంజాబ్‌ ఆసక్తి చూపింది. అతని కనీస ధర రూ. 2 కోట్లకే కింగ్స్‌ పంజాబ్‌ కొనుగోలు చేసింది.

ఒకానొక దశలో ఇదే ఐపీఎల్ వేలంలో రూ. 14కోట్ల వరకు పలికిన గేల్ ఇప్పుడు 2 కోట్లకే అమ్ముడవడం.. పాపం గేల్. అయితే న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు గప్టిల్‌కు మూడోసారి కూడా నిరాశే ఎదురైంది.

ఇదిలా ఉంటే గతేడాది నిర్వహించిన వేలంలో రూ. 12 కోట్లకు అమ్ముడుపోయిన ఇంగ్లాండ్ పేసర్‌ తైమాల్‌ మిల్స్‌ను ఈసారి ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబర్చలేదు. 2017లో జరిగిన వేలంలో తైమాల్ మిల్స్‌కు భారీ మొత్తం చెల్లించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 28, 2018, 17:15 [IST]
Other articles published on Jan 28, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+