Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ అభిమానులకు శుభవార్త: ప్లేఆఫ్ షెడ్యూల్‌లో మార్పులు

IPL Play-offs & Final to Start at 7pm Keeping Fans in Mind: Rajeev Shukla

హైదరాబాద్: క్రికెట్ అంటే పనులన్నీ మానేసి చక్కగా టీవీల ముందు, స్టేడియాల దగ్గర ఉండిపోయే అభిమానులకు ఐపీఎల్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అర్ధరాత్రి వరకు సాగుతూ క్రికెట్ ఫ్యాన్స్‌కు నిద్ర లేకుండా చేస్తున్నది ఐపీఎల్. స్లో ఓవర్ రేట్‌ల కారణంగా కొన్ని మ్యాచ్‌లు ఒక్కోసారి రాత్రి 12 దాకా కూడా సాగుతున్నాయి. దీనివల్ల కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ ప్లేఆఫ్స్, ఫైనల్ సమయాల్లో మార్పు చేసినట్లు చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు.

తద్వారా సాధారణంగా రాత్రి 8 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లు 7 గంటలకే ప్రారంభమవుతాయని శుక్లా చెప్పారు. స్టేడియాల నుంచి అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లే అభిమానులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికితోడు టీవీల్లో చూసేవాళ్లు కూడా ఉదయాన్నే పనులకు వెళ్లడం కష్టమవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజీవ్ శుక్లా తెలిపారు. రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్నాయి.

మే 23, 25న ఈ రెండు మ్యాచ్‌లో జరుగుతాయి. ముంబైలోని వాంఖడె స్టేడియం మే 22న జరిగే క్వాలిఫయర్ 1తోపాటు మే 27న జరిగే ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి. మే 22, 23, 25, 27తేదీల్లో జరిగే మ్యాచ్‌లకు కొత్త మార్పులు వర్తిస్తాయి.

కాగా సోమవారం జరిగిన మ్యాచ్‌తో దాదాపు బెంగళూరు జట్టు ప్లేఆఫ్‌ మ్యాచ్ ఆడేందుకు అవకాశాలు దాదాపు కోల్పోయినట్లే. ఇప్పటి వరకూ లీగ్‌‌లో పాల్గొంటున్న అన్ని జట్లు ఒక్కొక్కటి పది మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో 8గెలిచి సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉండగా ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆఖరి చోటు దక్కించుకుంది.

Story first published: Wednesday, May 9, 2018, 15:04 [IST]
Other articles published on May 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+