టీమిండియాలోకి అంబటి రాయుడు: ఐపీఎల్ ప్రదర్శనే అవకాశం కల్పించిందా?

హైదరాబాద్: ఒకసారి అవకాశం కోల్పోయిన తర్వాత తిరిగి జాతీయ జట్టులో స్థానం పొందడం కోసం క్రికెటర్లు ఎంతో తాపత్రయపడుతుంటారు. ఈ కోవలోనే సురేశ్ రైనా ఇటీవల జరిగిన నిదహాస్ ట్రోఫీలో స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ లక్కు అంబటి రాయుడుకు చిక్కింది. ఐపీఎల్ 11లో పరుగుల వరద పారిస్తోన్న తెలుగుతేజం అంబటి రాయుడు మళ్లీ టీమిండియా తలుపు తట్టే అవకాశాలున్నాయని మేధావుల అంచనా.
తన అద్భుతమైన బ్యాటింగ్ శైలితో భారీ స్కోరు సహాయంతో చెన్నై జట్టు గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నాడు రాయుడు. ఇంతటి తిరుగులేని ఆటతీరుతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న రాయుడు ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లతో జరగనున్న టీ20 సిరీస్‌లో ఆడే అవకాశం ఉందని సమాచారం. రాయుడి ఆటతీరును గమనిస్తున్నామని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో రాయుడికి పిలుపు అందడం ఖాయమే.

ఐపీఎల్ 11లో రాయుడు కంటే అధిక స్కోరు ఆటగాడు లేరు:
ఇప్పటి వరకూ ఈ ఐపీఎల్ సీజన్లో పది ఇన్నింగ్స్ ఆడిన రాయుడు 42.3 సగటుతో 423 పరుగులు సాధించాడు. చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషిస్తోన్న రాయుడు 151.61 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టడం విశేషం. ఐపీఎల్ 11లో రాయుడు కంటే అధిక స్కోరు చేసిన ఆటగాడు మరొకరు లేరు. అతని తర్వాతి స్థానంలో కేన్ విలియమసన్ 400పరుగులతో ఉన్నాడు. ఇదిలా ఉంటే రాయుడు ఖాతాలో ఇదే సీజన్ కు సంబంధించి 2హాఫ్ సెంచరీలు సైతం ఉన్నాయి.

2016లో జింబాబ్వే పర్యటనలో భారత్ తరఫు:
రాయుడు చివరగా 2016లో జింబాబ్వే పర్యటనలో ధోనీ నాయకత్వంలో భారత్ తరఫున ఆడాడు. ఐపీఎల్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తోన్న కేఎల్ రాహుల్, ఉమేశ్ యాదవ్‌లకు కూడా తిరిగి భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌లో పర్యటించే వన్డే జట్టులో వీరిద్దరికీ చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేసిన రాహుల్ అనంతరం జట్టులో చోటు కోల్పోయాడు.

కుల్దీప్ యాదవ్‌ను టెస్టు జట్టులోకి ఎంపిక:
సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అనూహ్యంగా ఉమేశ్ యాదవ్‌ను పక్కనబెట్టారు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్‌కు టెస్టు జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు అంబటి రాయుడు అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు.

400 పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా:
ఈ ఐపీఎల్ సీజన్‌లో 400 పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రాయుడు నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసింది. 128 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications