
హైదరాబాద్: ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో యువ ఆటగాళ్లకు అత్యధిక మొత్తంలో ధరలు వెచ్చించి మరీ ఫ్రాంచైజీలు కొనుగోలు చేసుకున్నాయి. సీనియర్లకు నిరాశే ఎదురైంది. ఇప్పుడు ముంబై హైకోర్టు సైతం యువకులను ఉద్దేశించే ఐపీఎల్ యువతపై ఎలా ప్రభావం చూపనుందో అని తెలిపింది.
ఐపీఎల్‌తో 'బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్' అనే పదాలు ప్రజల నోళ్లలో నానుతున్నాయని ముంబై హైకోర్టు తీవ్రంగా . విదేశీ మారక ద్రవ్య నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఇక ఐపీఎల్ క్రికెట్ అభివృద్ధికి ఏమేర దోహదం చేస్తుందో చూడాల్సి ఉందని పేర్కొంది.
ఫెమా కేసులో సాక్షుల క్రాస్ ఎగ్జామిన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనుమతి నిరాకరిస్తూ జారీచేసిన 2015నాటి ఉత్తర్వును సవాలు చేస్తూ ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ పిటిషన్‌పై మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్‌సీ ధర్మాధికారి, భారతీ దంగ్రేలతో కూడిన ధర్మాసనం ఈ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఐపీఎల్ సందర్భంగా విదేశీ మారక ద్రవ్య నిబంధనలను ఉల్లంఘించారని ఈడీ ఆరోపించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.