KKR VS RCB: అంతా కొత్త కొత్తగా.. ఐపీఎల్ 2025లో చోటు చేసుకున్న మార్పులివే
IPL 2025 KKR VS RCB : ఐపీఎల్ మెగా పండగ వచ్చేసింది. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ తో ఈ ఐపీఎల్ సీజన్ తెరలేవనుంది. అలానే ఈ ఐపీఎల్ సీజన్ లో కొన్ని కొత్త నిబంధనలతో పాటు కొత్త సారథులు వచ్చారు. సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ 18వ ఎడిషన్ లో చోటు చేసుకున్న మార్పులు, ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం..
కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ.. తొలి సారి ఐపీఎల్ 2008 ప్రారంభ ఎడిషన్ ఓపెనింగ్ మ్యాచ్ లో తలపడ్డాయి. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఓపెనింగ్ మ్యాచ్ లో ఇరు జట్లు ఢీ కొనబోతుండటం ఇదే తొలిసారి.

- రాత్రి పూట జరిగే మ్యాచులలో.. మంచు ప్రభావం కారణంగా రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ జట్టుకు రెండో బంతి అందించనున్నారు. 11 ఓవర్ల తర్వాత అంపైర్ల అనుమతితో రెండో బంతిని ఉపయోగించవచ్చు.
- ఎత్తు వైడ్లు, ఆఫ్‌సైడ్ వైడ్లకు కూడా డీఆర్‌ఎస్‌ను ఉపయోగించుకోవచ్చు.
- డీమెరిట్ పాయింట్స్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయనుంది.
- కరోనా సమయంలో బంతికి ఉమ్మి రాయడంపై నిషేధాన్ని విధించిన నిర్వాహకులు.. ఇప్పుడు దాన్ని తొలిగించారు.
- ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను కొనసాగిస్తున్నారు.
- ఇంకా ఈ ఐపీఎల్ సీజన్ లో పలు జట్లకు కొత్త సారథులు సారథులు మారారు. కోల్‌కతాకు అజింక్య రహానే, ఆర్సీబీకి రజత్ పాటిదార్, లక్నోకు రిషభ్ పంత్, పంజాబ్‌కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీకి అక్షర్ పటేల్ కెప్టెన్లకు ఎంపికయ్యారు.
- అయితే వీరిలో రజత పటిదార్ ప్రత్యేకం. ఎందుకంటే అతడు ఇప్పటివరకు భారత్ తరఫున ఒక్క టీ20 కూడా ఆడకుండానే.. ఐపీఎల్ లో సారథ్య బాధ్యతలను అందుకున్నాడు.
- రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ వేలికి గాయమైంది. దీంతో తొలి మూడు మ్యాచ్‌లకు రియాన్ పరాగ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
- ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య తొలి మ్యాచ్ లో నిషేధానికి గురి అయ్యాడు. దీంతో సూర్యకుమార్ సారథిగా ఉండనున్నాడు. మొత్తంగా ఈ కొత్త కెప్టెన్లు తమ జట్లపై ఎలాంటి ముద్ర వేస్తారో..
- దిల్లీ పగ్గాలు అందుకున్న పంత్.. టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధరకు (రూ.27 కోట్లకు) అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు.
Story first published: Saturday, March 22, 2025, 8:41 [IST]
Other articles published on Mar 22, 2025
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications