
హైదరాబాద్‌లో మెగా వేలం
ఐపీఎల్ మెగా వేలం కోసం ఎదురు చూసే అభిమానులకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అదిరేపోయే వార్త చెప్పింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో ఐపీఎల్ వేలం నిర్వహించాలని నిర్ణయించింది. అంతేకాకుండా హైదరాబాద్ లేదా బెంగళూరులో ఈ వేలం నిర్వహించాలని చూస్తున్నారు. మొత్తానికి ఈ రెండు ప్రధాన నగరాల్లోనే ఏదోక నగరంలో ఐపీఎల్ మెగా వేలం జరగడం ఖాయమైపోయింది. గతంలో మాదిరిగానే ఈ వేలాన్ని రెండు రోజులపాటు నిర్వహంచనున్నారు. ఈ మేరకు బీసీసీఐ నుంచి కూడా క్లియరెన్స్ వచ్చేసింది. ఇప్పటికే ఐపీఎల్ గవర్నర్ కౌన్సిల్ కమిటీ అన్ని జట్లకు ఈ వివరాలను అందించింది.

2018 తర్వాత మళ్లీ ఇప్పుడే
2018 తర్వాత ఐపీఎల్ మెగా వేలం మళ్లీ 2022 ఫిబ్రవరిలోనే జరగనుంది. ఈ సారి ఆటగాళ్లు భారీగా పాల్గొంంటుడడానికి తోడు మరో రెండు టీమ్‌లు కూడా అదనంగా పాల్గొంటుండడంతో వేలంపై అంతటా ఆసక్తి నెలకొంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మొదలు కానున్న ఐపీఎల్ 2022లో ఈ సారి పది జట్లు పాల్గొంటుండడంతో దానికి తగ్గట్టే ఈ టోర్ని కూడా ఎక్కువ రోజులు జరగనుంది. చివరగా 2011లో ఐపీఎల్‌లో 10 జట్లు పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌లోకి కొత్త జట్లు
ఈ సారి ఐపీఎల్‌లోకి అహ్మదాబాద్, లఖ్‌నవూ అనే కొత్త జట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు కొత్త జట్లు కావడంతో వేలానికి ముందే నలుగురేసి ఆటగాళ్లను ఎంచుకునే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది. కాగా అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ 5600 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా, లఖ్‌నవూ జట్టును 7,090 కోట్ల రూపాయలకు ఆర్పీఎస్జీ గ్రూప్ బిడ్ వేసి దక్కించుకుంది.


Click it and Unblock the Notifications












