ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. అంచనాలకు తగ్గట్లుగా కొందరు రికార్డు ధర అందుకోగా, మరికొందరు తక్కువ ధరకే అమ్ముడుపోయారు. మరికొంతమంది అనూహ్యంగా జాక్‌పాట్ కొట్టారు. మొత్తంగా పది ఫ్రాంచైజీలు 72 మంది ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. తొలి రోజు వేలంలో ఫ్రాంచైజీలు ఏకంగా రూ.467.95 కోట్లు ఖర్చు పెట్టాయి. జెడ్డా వేదికగా సోమవారం కూడా ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. అయితే వేలంలో ఆఖరి రోజు అయిన ఇవాళ ఏఏ ఫ్రాంచైజీలు ఎంత మొత్తంతో, ఎన్ని ఆర్‌టీఎమ్‌లతో, ఎంతమంది ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని బరిలోకి దిగుతుందనే వివరాలు మీ కోసం..
ముంబయి ఇండియన్స్
రిటైన్ ప్లేయర్లు: బుమ్రా (18), సూర్యకుమార్ (16.35), హార్దిక్ (16.35), రోహిత్ (16.30), తిలక్ (8)
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: బౌల్ట్ (12.50), నమన్ ధీర్ (5.25), రాబిన్ (రూ.65 లక్షలు), కర్ణ్ శర్మ (రూ.50 లక్షలు)
పెట్టిన ఖర్చు: రూ. 93.90 కోట్లు
మిగిలిన డబ్బు: రూ. 26.10 కోట్లు
మిగిలిన ఆర్‌టీఎమ్: 0
కావాల్సిన ప్లేయర్లు: 16 (విదేశీ ఆటగాళ్లు- 07)

చెన్నై సూపర్ కింగ్స్
రిటైన్ ప్లేయర్లు: రుతురాజ్ (18), జడేజా (18), పతిరన (13), శివమ్ దూబె (12), ధోని (4)
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: నూర్ అహ్మద్ (10), అశ్విన్ (9.75), కాన్వే (6.25), ఖలీల్ అహ్మద్ (4.80), రచిన్ రవీంద్ర (4), రాహుల్ త్రిపాఠి (3.40), విజయ్ శంకర్ (1.20)
పెట్టిన ఖర్చు: రూ.104.40 కోట్లు
మిగిలిన డబ్బు: రూ.15.60 కోట్లు
మిగిలిన ఆర్‌టీఎమ్: 0
కావాల్సిన ప్లేయర్లు: 13 (విదేశీ ఆటగాళ్లు- 04)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రిటైన్ ప్లేయర్లు: కోహ్లి (21), రజత్ (11), యశ్ దయాల్ (5)
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: హేజిల్‌వుడ్ (12.50), ఫిల్ సాల్ట్ (11.50), జితేశ్ (11), లివింగ్‌స్టన్ (8.75), రసిక్ సలాం (6), సుయాష్ (2.60)
పెట్టిన ఖర్చు: రూ. 89.53 కోట్లు
మిగిలిన డబ్బు: రూ. 30.65 కోట్లు
మిగిలిన ఆర్‌టీఎమ్: 03
కావాల్సిన ప్లేయర్లు: 16 (విదేశీ ఆటగాళ్లు- 05)
సన్‌రైజర్స్ హైదరాబాద్
రిటైన్ ప్లేయర్లు: క్లాసెన్ (23), కమిన్స్ (18), అభిషేక్ (14), హెడ్ (14), నితీశ్‌కుమార్ (6)
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: ఇషాన్ కిషన్ (11.25), షమి (10), హర్షల్ (8), అభినవ్ (3.20), రాహుల్ చాహర్ (3.20), జంపా (2.40), సిమర్‌జీత్ (1.50), అథర్వ (రూ.30 లక్షలు)
పెట్టిన ఖర్చు: రూ. 114.85 కోట్లు;
మిగిలిన డబ్బు: రూ. 5.15 కోట్లు
మిగిలిన ఆర్‌టీఎమ్: 01
కావాల్సిన ప్లేయర్లు: 12 (విదేశీ ఆటగాళ్లు- 04)
కోల్‌కతా నైట్ రైడర్స్
రిటైన్ ప్లేయర్లు: రింకు (13), వరుణ్ (12), నరైన్ (12), రసెల్ (12), హర్షిత్ (4), రమణ్‌దీప్ (4)
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: వెంకటేశ్ అయ్యర్ (23.75), నోకియా (6.50), డికాక్ (3.60), రఘువంశీ (3), గుర్బాజ్ (2), వైభవ్ (1.80), మయాంక్ మార్కండె (రూ.30 లక్షలు)
పెట్టిన ఖర్చు: రూ. 109.95 కోట్లు;
మిగిలిన డబ్బు: 10.05
మిగిలిన ఆర్‌టీఎమ్: 0
కావాల్సిన ప్లేయర్లు: 12 (విదేశీ ఆటగాళ్లు- 03)
లక్నో సూపర్ జెయింట్స్
రిటైన్ ప్లేయర్లు: పూరన్ (21), రవి బిష్ణోయ్ (11), మయాంక్ యాదవ్ (11), మోసిన్ (4), బదోని (4)
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: పంత్ (27), అవేశ్ (9.75), మిల్లర్ (7.50), సమద్ (4.20), మార్ష్ (3.40), మార్‌క్రమ్ (2), ఆర్యన్ (రూ.30 లక్షలు)
పెట్టిన ఖర్చు: రూ. 105.15 కోట్లు
మిగిలిన డబ్బు: రూ.14.85 కోట్లు
మిగిలిన ఆర్‌టీఎమ్: 0
కావాల్సిన ప్లేయర్లు: 13 (విదేశీ ఆటగాళ్లు- 04)
ఢిల్లీ క్యాపిటల్స్
రిటైన్ ప్లేయర్లు: అక్షర్ (16.50), కుల్‌దీప్ (13.25), స్టబ్స్ (10), అభిషేక్ (4)
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: కేఎల్ రాహుల్ (14), స్టార్క్ (11.75), నటరాజన్ (10.75), ఫ్రేజర్ (9), హ్యారీబ్రూక్ (6.25), అశుతోష్ (3.80), మోహిత్ శర్మ (2.20), సమీర్ రిజ్వీ (రూ.95 లక్షలు), కరుణ్ నాయర్ (రూ.50 లక్షలు)
పెట్టిన ఖర్చు: రూ. 106.20 కోట్లు
మిగిలిన డబ్బు: రూ. 13.80 కోట్లు
మిగిలిన ఆర్‌టీఎమ్: 1
కావాల్సిన ప్లేయర్లు: 12 (విదేశీ ఆటగాళ్లు- 04)
రాజస్థాన్ రాయల్స్
రిటైన్ ప్లేయర్లు: శాంసన్ (18), జైస్వాల్ (18), పరాగ్ (14), ధ్రువ్ (14), హెట్‌మయర్ (11), సందీప్ (4)
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: ఆర్చర్ (12.50), హసరంగ (5.25), తీక్షణ (4.40), ఆకాశ్ మధ్వాల్ (1.20), కుమార్ కార్తీకేయ (రూ.30 లక్షలు)
పెట్టిన ఖర్చు: రూ. 102.65 కోట్లు
మిగిలిన డబ్బు: రూ. 17.35 కోట్లు
మిగిలిన ఆర్‌టీఎమ్: 0
కావాల్సిన ప్లేయర్లు: 14 (విదేశీ ఆటగాళ్లు- 04)
గుజరాత్ టైటాన్స్
రిటైన్ ప్లేయర్లు: రషీద్ ఖాన్ (18), శుభ్‌మన్ (16.50), సాయి సుదర్శన్ (8.50), తెవాటియా (4), షారుక్ ఖాన్ (4);
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: బట్లర్ (15.75), సిరాజ్ (12.25), రబాడ (10.75), ప్రసిద్ధ్ కృష్ణ (9.50), మహిపాల్ లొమ్రోర్ (1.70), కుశాగ్ర (రూ.65 లక్షలు), మానవ్, అనుజ్, నిశాంత్ (30 లక్షలు)
పెట్టిన ఖర్చు: రూ.102.50 కోట్లు
మిగిలిన డబ్బు: రూ. 17.50 కోట్లు
మిగిలిన ఆర్‌టీఎమ్: 01
కావాల్సిన ప్లేయర్లు: 11 (విదేశీ ఆటగాళ్లు- 05)
పంజాబ్ కింగ్స్
రిటైన్ ప్లేయర్లు: శశాంక్ సింగ్ (5.50), ప్రభ్‌సిమ్రన్ (4)
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: శ్రేయస్ (26.75), చాహల్ (18), అర్ష్‌దీప్ (18), స్టాయినిస్ (11), నేహాల్ (4.20), మ్యాక్స్‌వెల్ (4.20), వైశాఖ్ (1.80), యశ్ థాకూర్ (1.60), హర్‌ప్రీత్ బ్రార్ (1.50), విష్ణు వినోద్ (రూ.95 లక్షలు)
పెట్టిన ఖర్చు: రూ. 97.50 కోట్లు
మిగిలిన డబ్బు: రూ. 22.50 కోట్లు
మిగిలిన ఆర్‌టీఎమ్: 03
కావాల్సిన ప్లేయర్లు: 13 (విదేశీ ఆటగాళ్లు- 06).