Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: మెగావేలం టైమింగ్స్ ఏంటి? ఆర్‌టీఎమ్‌, బడ్జెట్ ఎంత? - పూర్తి వివరాలు!

ఐపీఎల్ మెగా వేలానికి వేళైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా రేపు, ఎల్లుండి మెగా ఆక్షన్ జరగనుంది. విదేశాల్లో వేలం జరగడం వరుసగా ఇది రెండోసారి. కాగా, ఈ నేపథ్యంలో మెగా వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు...

టైమింగ్స్ ఏంటి?
ఐపీఎల్ మెగా వేలం భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. స్థానికంగా మధ్యాహ్నం 1 గంటకు మొదలవుతుంది. గంటన్నర పాటు వేలం జరిగిన తర్వాత 45 నిమిషాలు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత స్థానికంగా రాత్రి 8 గంటల వరకు వేలం కొనసాగుతుంది.

IPL Mega Auction 2025 Date Rules Players and All You Need to Know

లైవ్ చూడాలంటే?
ఐపీఎల్ మెగా ఆక్షన్‌ను టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఛానెళ్లలో వీక్షించాలి.జియో సినిమా యాప్ ద్వారా మొబైల్స్‌లో లైవ్ ఉచితంగా చూడవచ్చు. జియో సినిమా వెబ్‌సైట్‌లోనూ ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.

వేలానికి వచ్చే ఆటగాళ్లు ఎంత మంది?
ఐపీఎల్ మెగా వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 577 మందినే షార్ట్ లిస్ట్ చేసింది. వాళ్లలో మొత్తంగా 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు.

అత్యధిక రిజర్వ్ ధరతో ఎంతమంది వస్తున్నారు?
షార్ట్ లిస్ట్‌లోని ఆటగాళ్లలో 82 మంది రూ.2 కోట్ల రిజర్వ్ ధరతో మెగా వేలానికి వస్తున్నారు. 27 మంది ఆటగాళ్లు రూ.1.50 కోట్లు, 18 మంది ప్లేయర్లు రూ.1.25 కోట్లు, 23 మంది రూ. 1 కోటి, 92 మంది రూ.75 లక్షలు, 8 మంది రూ. 50 లక్షలు, అయిదుగురు రూ.40 లక్షలు, 320 మంది కనీస ధర రూ.30 లక్షలతో వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

మార్క్యూ లిస్ట్‌లు ఎన్ని? వేలం ఎలా మొదలవుతుంది?
ఆరుగురు చొప్పున ఆటగాళ్లతో రెండు మార్క్యూ లిస్ట్‌లు ఉన్నాయి. ఎమ్-1లో రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, జోస్ బట్లర్, అర్షదీప్ సింగ్, కగిసో రబాడ, మిచెల్ స్టార్క్ ఉన్నారు. ఎమ్-2లో కేఎల్ రాహుల్, యుజువేంద్ర చాహల్, లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. ఈ మార్క్యూ లిస్ట్‌లతో వేలం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, వికెట్ కీపర్లు, స్పిన్నర్లు, ఆల్‌రౌండర్లు విభాగాలుగా వేలం జరుగుతుంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్లలోనూ ఇదే తరహా వేలం జరుగుతుంది.

ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత మొత్తం?
పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ.110.5 కోట్లు ఉన్నాయి. అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 41 కోట్లు ఉన్నాయి. ఇక సీఎస్కే- రూ.55 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్- రూ. 73 కోట్లు, కేకేఆర్- రూ. 51 కోట్లు, ఆర్సీబీ- రూ. 53 కోట్లు, లక్నో- రూ. 69 కోట్లు, ముంబై ఇండియన్స్- రూ.45 కోట్లు, ఎస్‌ఆర్‌హెచ్- రూ.45 కోట్లు, గుజరాత్ టైటాన్స్- రూ. 69 కోట్లు ఉన్నాయి.

ఏ ఫ్రాంచైజీ వద్ద ఎన్ని ఆర్‌టీఎమ్‌లు?
సీఎస్కే- 01 (క్యాప్డ్, అన్‌క్యాప్డ్‌లలో ఎవరినైనా తీసుకోవచ్చు)
ఢిల్లీ- 02 (1 క్యాప్డ్ & 1 అన్‌క్యాప్డ్ / 2 క్యాప్డ్ )
ఆర్సీబీ- 03 (2 క్యాప్డ్ & 1 అన్‌క్యాప్డ్ / 3 క్యాప్డ్)
లక్నో - 01 (క్యాప్డ్)
పంజాబ్- 04 (క్యాప్డ్)
ముంబై - 01 (అన్‌క్యాప్డ్)
ఎస్ఆర్‌హెచ్ - 01 (అన్‌క్యాప్డ్)
గుజరాత్- 01 (క్యాప్డ్).

Story first published: Saturday, November 23, 2024, 12:29 [IST]
Other articles published on Nov 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+