హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్‌లపై కావేరి జలాల విషయం తీవ్రత రోజురోజుకూ బోర్డు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరగనున్న చెన్నైసూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌పై ఈ ప్రభావం పడింది. చెన్నైలో జరిగే మ్యాచ్‌లను రద్దు చేయాలన్న డిమాండ్‌తో ప్రజా సంఘాలు ఆందోళనల్ని మరింత ఉద్ధృతం చేశాయి. అలాగే సాయంత్రం 5 గంటలకు చెపాక్ స్టేడియంను కూడా ముట్టడిస్తామని కొన్ని ప్రజా సంఘాలు హెచ్చరించాయి.
దీంతో చెన్నైలో హై అలర్ట్ ప్రకటించారు. స్టేడియం దగ్గర సెక్యూరిటీని పెంచారు. 5వేల మందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించారు. ప్లేయర్లకు కూడా సెక్యూరిటీని పెంచారు. అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరించాయి. కొన్ని ప్రజా సంఘాలు మ్యాచ్‌ను అడ్డుకోవాలనే ఉద్దేశంతో టిక్కెట్లు కొన్నట్లు సమాచారం కూడా ఉందట.
అందుకే స్టేడియంలోకి వచ్చేవారిపై పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. లోపలికి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు. వాటర్ బాటిల్స్, ప్లకార్డులు వంటివాటిని తీసుకురాకూడదని సూచించారు. మొత్తం మీద కావేరీ సెగల ఎఫెక్ట్ ఐపీఎల్ మ్యాచ్‌ల మీద కూడా పడింది.
వీటితో పాటుగా సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన రజనీకాంత్ చెన్నై జట్టు మ్యాచ్ లను ఇక్కడ జరగకుండా చూడాలని కోరారు. దానికోసం నిరసన తెలుపనున్నామని స్టేడియంకు నల్ల దుస్తులు వేసుకుని వస్తామని దానికి జట్టు సభ్యులు యాజమాన్యం సహకరించాలని కోరారు. దానికి బీసీసీఐ ససేమిరా అనడంతో వివాదం తీవ్రత మరింత రాజుకుంది. అందుకు తగ్గట్టుగానే స్టేడియం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వహకులు వెల్లడించారు.
ప్రజల సెంటిమెంట్‌ను అర్థం చేసుకుని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్‌లను నిర్వహించకుండా ఉంటే బాగుంటుందని మత్స్యశాఖ మంత్రి జయకుమార్ కోరాడు. ఒకవేళ నిబంధనల ప్రకారం నిర్వహించుకోదలుచుకుంటే ప్రభుత్వం పూర్తి స్థాయి భద్రత కల్పిస్తుందని చెప్పాడు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్‌లను తరలించే ప్రసక్తే లేదని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్‌శుక్లా స్పష్టం చేశారు.
Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి. Subscribe to Telugu MyKhel.
రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు