చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ-సాక్షిల ముద్దుల కూతురు జీవా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇటీవలే జీవా కొన్ని ఫొటులో విడుదల కాగా, ఇప్పుడు ఆమె తల్లి జీవా కొత్త ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో అప్ లోడ్ చేశారు.
మొదట జీవా చేతిని పోస్టు చేసిన సాక్షి సింగ్ ధోనీ.. ఇప్పుడు జీవా పూర్తి ఫొటోను అప్ లోడ్ చేశారు. చివరగా 'మై డాల్'ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నా' అని జీవా ఫొటోలను సాక్షి ట్విట్టర్లో పెట్టారు.

తన కూతురుతో పాటు బయటికి వచ్చిన సమయంలో ధోనీ తన కూతురును మీడియాకు చూపకుండా జాగ్రత్తలు తీసుకున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు తమ రెండు నెలల జీవా ఫొటోలను విడుదల చేశారు.
ఇంతకుముందు ఓ పాపను ధోనీ ఎత్తుకున్నప్పుడు తీసిన ఫొటోలు బయటికి రావడంతో.. ఆమెను జీవా అని ప్రచారం జరిగింది. అయితే అది తప్పుగా బయటికి వచ్చిన ఫొటో.. ఆమె జీవా కాదు అని సాక్షి స్పష్టం చేసింది. ఇప్పుడు పూర్తి స్థాయి జీవా ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు.
ప్రస్తుతం సాక్షి, జీవాలు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథిగా ఉన్న ధోనీతోపాటు ప్రతీ మ్యాచుకు హాజరవుతున్నారు.