Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL: శ‌భాష్ ధోని.. 4 త‌రాల ఆట‌గాళ్ల‌తో క‌లిసి కెప్టెన్సీ.. అయినా నాయ‌కత్వంలో ఏ మాత్రం త‌గ్గ‌ని ప‌దును

IPL: Mahendra Singh Dhoni captains in IPL with 4 generations players

టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోని గురించి ఎంత చెప్పిన త‌క్కువే అవుతుంది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా, వికెట్ కీప‌ర్‌గా లెక్క లేన‌న్నీ రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా టీమిండియాకు 3 ఐసీసీ ట్రోఫీలు అందించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘ‌న‌త సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లోనూ ధోని తన‌దైన ముద్ర వేశాడు. త‌న సుదీర్ఘ ఐపీఎల్ ప్ర‌యాణంలో ఎంద‌రో స్టార్ ఆట‌గాళ్ల‌తో క‌లిసి ఆడాడు. ఈ క్ర‌మంలో ధోని గొప్ప‌త‌నాన్ని తెలియ‌చేస్తూ ఒక పోస్టును అభిమానులు నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు.

4 త‌రాల ఆట‌గాళ్ల‌తో కెప్టెన్సీ షేర్

ఐపీఎల్‌లో మ‌హేంద్ర‌సింగ్ ధోని మొద‌టి నుంచి చెన్నైసూప‌ర్ కింగ్స్‌కే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. అంతేకాకుండా ఇప్ప‌టివ‌ర‌కు ముగిసిన అన్ని సీజ‌న్ల‌లో ఆ జ‌ట్టుకు ధోనినే కెప్టెన్‌గా వ్య‌వ‌హిరించాడు. ఈ క్ర‌మంలో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఆరంభ సీజ‌న్ల‌లో ధోని త‌న సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌తో క‌లిసి కెప్టెన్సీ చేశాడు. మ‌ధ్య‌లో త‌న టీమ్‌మెట్స్‌తో క‌లిసి కెప్టెన్సీ చేశాడు. ఆ త‌ర్వాత జూనియ‌ర్ల‌తో క‌లిసి కెప్టెన్సీ చేశాడు. తాజాగా తాను వీడ్కోలు ప‌లికే స‌మ‌యంలో క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఆట‌గాళ్ల‌తో సైతం క‌లిసి కెప్టెన్సీ చేస్తున్నాడు. ఇలా 4 త‌రాల ఆట‌గాళ్ల‌తో కెప్టెన్సీ షేర్ చేసుకున్న ఒకే ఒక్క ఆట‌గాడిగా మ‌హీ రికార్డు సృష్టించాడు. దీనికి సంబంధించిన ఓ పోస్టు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

 ఆరంభంలో సీనియ‌ర్లు, టీమ్‌మెట్స్‌తో

ఆరంభంలో సీనియ‌ర్లు, టీమ్‌మెట్స్‌తో

మ‌హేంద్ర‌సింగ్ ధోని ఐపీఎల్ ఆరంభ సీజ‌న్ల‌లో త‌న కంటే సీనియ‌ర్లైన సౌర‌వ్ గంగూలీ, స‌చిన్ టెండూల్క‌ర్, రాహుల్ ద్రావిడ్ వంటి సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌తో క‌లిసి కెప్టెన్‌గా చేశాడు. ఆ త‌ర్వాత 4వ సీజ‌న్ నుంచి త‌న తోటి ఆట‌గాళ్లైనా గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ఆట‌గాళ్ల‌తో క‌లిసి కెప్టెన్సీ చేశాడు. ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ మారిన పోస్టులో ధోని ఆరంభంలో సౌర‌వ్ గంగూలీ, ఆ త‌ర్వాత గౌతం గంభీర్‌తో కలిసి కెప్టెన్సీ చేసిన ఫోటోల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. గంభీర్, గంగూలీ ఇద్ద‌రు కూడా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు కెప్టెన్సీ చేసిన సంగ‌తి తెలిసిందే.

జూనియ‌ర్ల‌తో కెప్టెన్సీ షేర్

జూనియ‌ర్ల‌తో కెప్టెన్సీ షేర్

ఇక ఆ త‌ర్వాత ఆరో సీజ‌న్ నుంచి త‌న కంటే జూనియ‌ర్ ఆట‌గాళ్లైన రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ వంటి ఆట‌గాళ్ల‌తో క‌లిసి కెప్టెన్సీ చేశాడు. రోహిత్ శ‌ర్మ ముంబై ఇండియ‌న్స్‌కు, విరాట్ కోహ్లీ రాయల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు కెప్టెన్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా తాను రిటైర్ అయ్యే స‌మ‌యంలో టీంలోకి వ‌చ్చిన రిష‌బ్ పంత్, శ్రేయ‌స్ అయ్య‌ర్‌ వంటి ఆట‌గాళ్ల‌తో కూడా క‌లిసి ధోని కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ప్ర‌స్తుతం పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక గ‌తంలో ఢిల్లీకి కెప్టెన్‌గా ఉన్న శ్రేయ‌స్ అయ్య‌ర్, ఈ సారి కోల్‌క‌తానైట్‌రైడ‌ర్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇలా 4 త‌రాల ఆట‌గాళ్ల‌తో క‌లిసి కెప్టెన్సీ చేసిన‌ప్ప‌టికీ 40 ఏళ్ల వ‌య‌సులోనూ ధోని నాయ‌క‌త్వంలోని ప‌దును ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని అభిమానులు కొనియాడుతున్నారు.

 ప్ర‌తిసారి ఉత్సాహాన్ని పెంచుతున్నాడు

ప్ర‌తిసారి ఉత్సాహాన్ని పెంచుతున్నాడు

దీని గురించి తెలియ‌చేస్తూ అభిమానుల ధోని 14 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌ను ఉద్దేశించి ఒక పోస్టును వైర‌ల్‌గా మార్చారు. అందులో చాలా విషయాలు మారాయి. కానీ కొన్ని విషయాలు ఎప్పటికీ మారవ‌ని రాసుకొచ్చారు.14 సంవత్సరాల క్రితం మొదటి ఎల్లో రంగు దుస్తుల‌తో (సీఎస్కే) ధోని ఐపీఎల్ కెరీర్‌ చాలా వేగంతో ప్రారంభమైంద‌ని, అది ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంద‌ని తెలిపారు. ఒక వ్యక్తి దీన్ని ప్రారంభించాడ‌ని, అతను సీఎస్కేలో ప్రతిసారి ఉత్సాహాన్ని పెంచుతున్నాడ‌ని ధోనిని ఉద్దేశించి అభిమానులు రాసుకొచ్చారు.

Story first published: Tuesday, February 22, 2022, 13:58 [IST]
Other articles published on Feb 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+