For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏందిరా ఈ విధ్వంసం.. అరంగేట్ర మ్యాచ్ లోనే LSG ప్లేయర్ వరల్డ్ రికార్డ్

తాజాగా తన అరంగేట్ర వన్డే మ్యాచ్ లోనే ప్రపంచ రికార్డును నెలకొల్పాడు ఓ క్రికెటర్. అరంగేట్రంలోనే 150 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా ఘనత సాధించాడు. పాకిస్థాన్ వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాక్ మధ్య ముక్కోణపు వన్డే సిరీస్‌ ఈ అరుదైన రికార్డుకు వేదికైంది.

ఇంతకీ అతడెవరంటే?
ఈ ముక్కోణపు సిరీస్‌లో భాగంగా తాజాగా లాహోర్‌ గడాఫీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌తో సౌతాఫ్రికా బ్యాటర్ 26 ఏళ్ల మాథ్యూ బ్రీట్జ్‌కే అరంగేట్రం చేశాడు. అలా అరంగేట్రం చేసిన అతడు వచ్చీ రాగానే.. తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 148 బంతులు ఎదుర్కొన్న అతడు ఏకంగా 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 150 పరుగులు సాధించాడు. తద్వారా ఓ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

IPL LSG Player Breetzke Creates History with 150 runs on ODI Debut in NZ vs SA
Photo Credit: twitter

ఆ రికార్డు ఏంటంటే ?
వన్డేల్లో అరంగేట్ర మ్యాచ్ లోనే 150 పరుగులు సాధించిన తొలి ప్లేయర్ గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు బ్రీట్జ్. గతంలో వన్డేల్లో అరంగేట్ర మ్యాచ్ లోనే అత్యధిక స్కోరు సాధించిన రికార్డు డెస్మండ్ హేన్స్ పేరిట ఉంది. అతడు 1978లో ఆస్ట్రేలియాపై 148 పరుగులు చేసింది.

కాగా, ఐపీఎల్‌ 2025 సీజన్‌లో బ్రీట్జ్‌కేను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు కొనుగోలు చేసింది. రూ.75 లక్షలకు సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు అతడు ఐపీఎల్ 2025 సీజన్ లో కీలకంగా వ్యవహరిస్తాడని లఖ్ నవూ అభిమానులు ఆశిస్తున్నారు.

వన్డేల్లో అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు ప్లేయర్స్ వీరే

సౌతాఫ్రికా ప్లేయర్ మాథ్యూ బ్రీట్జ్‌కే - 2025లో న్యూజిలాండ్‌పై 150 పరుగులు
వెస్టిండీస్ ప్లేయర్ డెస్మండ్ హేన్స్‌ - 1978లో ఆస్ట్రేలియాపై 148 పరుగులు
అఫ్గానిస్థాన్ ప్లేయర్ రెహ్మనుల్లా గుర్బాజ్‌ - 2021లో ఐర్లాండ్‌పై 127 పరుగులు
హంకాంగ్‌ ప్లేయర్ మార్క్‌ చాప్‌మన్ - 2015 యూఏఈపై 124* పరుగులు
సౌతాఫ్రికా ప్లేయర్ కోలిన్ ఇంగ్రామ్ - 2010 జింబాబ్వేపై 124 పరుగులు

Story first published: Monday, February 10, 2025, 16:12 [IST]
Other articles published on Feb 10, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+