Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉప్పల్‌లో సంజూ శాంసన్ సెంచరీ: సన్‌రైజర్స్ విజయ లక్ష్యం 199

Sanju Samson

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో తొలి సెంచరీ నమోదైంది. టోర్నీలో భాగంగా ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ (102 నాటౌట్: 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీతో నమోదు చేశాడు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో ఓపెనర్ జోస్ బట్లర్ (5) ఆరంభంలోనే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్.. మరో ఓపెనర్ అజింక్య రహానే (70: 49 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) కలిసి రెండో వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోరు 134 వద్ద రహానే ఔటయ్యాడు.

1
45764

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్‌స్టోక్స్ (16 నాటౌట్: 9 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగిన సంజు శాంసన్ సెంచరీని నమోదు చేశాడు. ఐపీఎల్‌లో సంజూ శాంసన్‌కి ఇది రెండో సెంచరీ. అంతేకాదు పిన్న వయసులో ఐపీఎల్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా సంజు శాంసన్(25 ఏళ్లు) రికార్డు సృష్టించాడు.

Story first published: Friday, March 29, 2019, 22:14 [IST]
Other articles published on Mar 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+