For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: వాంఖడెలో పంత్ సిక్సర్ల మోత, ముంబై టార్గెట్ 214

IPL 2019 : Rishabh Pant Brought Up His 50 Off 18 Balls
pant

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్ యువ హిట్టర్ రిషబ్ పంత్ సిక్సర్లతో చెలరేగిపోయాడు. ముంబై ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో రిషబ్ పంత్ (78 నాటౌట్: 27 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సులు) హాఫ్ సెంచరీ సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

దీంతో ముంబై ఇండియన్స్‌కి ఢిల్లీ క్యాపిటల్స్‌ 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై బౌలర్లలో బుమ్రాతో సహా అందరి బౌలింగ్‌లోనూ పంత్ సిక్సర్ల మోత మోగించాడు. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆదిలోనే పృథ్వీషా(7) వికెట్‌ను కోల్పోయింది. ఆపై కాసేపటికి శ్రేయస్‌ అయ్యర్‌(16) కూడా పెవిలియన్‌ చేరడంతో ఢిల్లీ 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి మారిన ఓపెనర్ శిఖర్ ధావన్ (43: 36 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్) జట్టుకి మెరుగైన ఆరంభమివ్వగా.. మిడిల్ ఓవర్లలో ఇంగ్రామ్ (47: 32 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్)తో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ 83 పరుగులు జత చేయడంతో ఢిల్లీ గాడిలో పడింది.

1
45759

అయితే శిఖర్ ధావన్‌, ఇన్‌గ్రామ్‌లు స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్‌.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయి ఆడాడు. 27 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్పర్లతో అజేయంగా 78 పరుగులు చేశాడు.

దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్లీన్‌గాన్‌ మూడు వికెట్లు సాధించగా, బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, బెన్‌ కట్టింగ్‌లు తలో వికెట్‌ తీశారు.

Story first published: Sunday, March 24, 2019, 22:28 [IST]
Other articles published on Mar 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+