హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చెపాక్ వేదికగా గత శనివారం బెంగళూరుపై గెలుపొందిన చెన్నై.. మంగళవార ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఢిల్లీ నిర్దేశించిన 148 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదనలో షేన్ వాట్సన్ (44: 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు), రైనా(30), కేదార్ జాదవ్(27)లు తమ వంతు బాధ్యత పోషించారు. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (32 నాటౌట్: 35 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో.. మరో 2 బంతులు మిగిలి ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ 150/4తో విజయాన్ని అందుకుంది.
🙌🙌🙌#VIVOIPL pic.twitter.com/FDl4Fj36gG
— IndianPremierLeague (@IPL) March 26, 2019
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీని చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే దూకుడుగా ఆడుతున్న యువ ఓపెనర్ పృథ్వీ షా(24; 16 బంతుల్లో 5 ఫోర్లు) జట్టు స్కోరు 36 వద్ద ఔటవ్వగా... శిఖర్ ధావన్(51: 47 బంతుల్లో 7ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు.
2 in 2 for @ChennaiIPL
— IndianPremierLeague (@IPL) March 26, 2019
Bravo finishes it off for #CSK as they win by 6 wickets and register their second win of #VIVOIPL 2019 season
Scorecard - https://t.co/AWx9J47Cvh #DCvCSK pic.twitter.com/otlJon8eP9
ఆ తర్వాత క్రీజులోకి దిగిన శ్రేయస్ అయ్యర్ (18; 20 బంతుల్లో 1 సిక్స్)తో కలిసి ధావన్ ఇన్నింగ్స్‌ను సరిదిద్దాడు. కీలక సమయంలో శ్రేయాస్ అయ్యర్‌ను ఇమ్రాన్ తాహిర్ ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత ప్రమాదకరంగా మారుతున్న రిషబ్ పంత్(25;13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) బ్రావో వేసిన భారీ షాట్ ఆడి.. బౌండరీ లైన్ వద్ద శార్దుల్ ఠాకూర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
Go Papaaaaa, says Ziva Dhoni 😊😊@ChennaiIPL #VIVOIPL pic.twitter.com/aYmHbK9hE0
— IndianPremierLeague (@IPL) March 26, 2019
ఈ క్రమంలో 15.2 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న ఢిల్లీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. శిఖర్ ధావన్ దూకుడుగా ఆడే క్రమంలో డ్వేన్ బ్రావో వేసిన 18వ ఓవర్ తొలి బంతికే వెనుదిరిగాడు. ధావన్ హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ భారీ షాట్లు కొట్టడంలో తడబడ్డాడు. దీంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని ఢిల్లీ చేజార్చుకుంది.
చివర్లో రాహుల్ తెవాతియా(11 నాటౌట్), అక్షర్ పటేల్(9 నాటౌట్)లు తలో బౌండరీ సాధించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రేవో మూడు వికెట్లు సాధించగా, దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, ఇమ్రాన్ తాహీర్‌లకు తలో వికెట్ దక్కింది.
Innings Break!
— IndianPremierLeague (@IPL) March 26, 2019
Clinical bowling from @ChennaiIPL restrict @DelhiCapitals to a total of 147/6 in 20 overs. In how many overs do you reckon will #CSK attain the target? #VIVOIPL #DCvCSK pic.twitter.com/YRSWzBudFf