న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: చెన్నై స్పిన్నర్ల దెబ్బకు ఆర్సీబీ 70 పరుగులకే ఆలౌట్

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 70 పరుగులకే ఆలౌటైంది. స్పిన్నర్లు హర్భజన్ సింగ్ (3/20), ఇమ్రాన్ తాహిర్ (3/9) ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకున్న బెంగళూరు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.

ఓపెనర్‌ పార్థీవ్ పటేల్ (29: 35 బంతుల్లో 2 ఫోర్లు) 18వ ఓవర్ వరకూ క్రీజులో నిలిచి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌ స్పిన్‌కి అనుకూలించేలా కనిపిస్తుండటంతో చెన్నై ముగ్గురు స్పిన్నర్లు, బెంగళూరు ఇద్దరు స్పిన్నర్లలతో బరిలోకి దిగింది.

Mar 23, 2019, 9:23 pm IST

70 పరుగులకే ఆర్సీబీ ఆలౌటైంది. డ్వేన్‌ బ్రావో వేసిన ఇన్నింగ్స్ 17.1వ బంతిని ఆడబోయి పార్థివ్‌ పటేల్‌ (29) ఔటయ్యాడు. దీంతో 70 పరుగులకే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆలౌటైంది.

Mar 23, 2019, 9:09 pm IST

ఆర్సీబీ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ నాలుగో బంతికి చాహల్‌ (4) భారీ షాట్‌కు యత్నించి లాంగ్‌ ఆన్‌లో హర్భజన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

Mar 23, 2019, 9:05 pm IST

13 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పార్థివ్‌ (20), చాహల్‌ (4) ఉన్నారు.

Mar 23, 2019, 8:59 pm IST

ఆర్సీబీ ఏడో వికెట్ కోల్పోయింది. ఇమ్రాన్ తాహిర్ వేసిన ఇన్నింగ్స్ 11.1 బంతికి నవదీప్ షైనా (2) పరుగుల వద్ద ఔటయ్యాడు. తాహిర్‌కి ఇది రెండో వికెట్ కావడం విశేషం.

Mar 23, 2019, 8:56 pm IST

తొలి మ్యాచ్‌లో ఆటగాళ్లు నిరాశపరిచారు. 11 ఓవర్లకు గాను ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ 10.3వ బంతికి గ్రాండ్‌హోమ్‌ (4) ఔటయ్యాడు.

Mar 23, 2019, 8:51 pm IST

10 ఓవర్లకు గాను ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోలిన్ డి గ్రాండ్‌హోమ్‌ (4), పార్థివ్‌ (16) క్రీజులో ఉన్నారు.

Mar 23, 2019, 8:46 pm IST

చెన్నై పిచ్ ఆఫ్‌ స్పిన్నర్లకు సహకరిస్తుండటంతో ఆ జట్టు కెప్టెన్ ధోని ఆఫ్‌ స్పిన్నర్లను బరిలోకి దించుతున్నాడు. ఇందులో భాగంగా 9వ ఓవర్‌ను సురేశ్ రైనా చేత వేయించాడు. దీంతో 9 ఓవర్లకు ముగిసే సరికి ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. శివమ్‌ దూబె (2), పార్థివ్‌ పటేల్‌ (16) క్రీజులో ఉన్నారు. మరోవైపు ఆఫ్ స్పిన్నర్ భజ్జీ 4 ఓవర్ల కోటా పూర్తైంది. భజ్జీ తన 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి 20 పరుగులిచ్చాడు.

Mar 23, 2019, 8:43 pm IST

తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ తడబడుతోంది. 8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. అంతకముందు భజ్జీ వేసిన 7.6వ బంతిని ఆడిన విండీస్‌ వీరుడు హెట్‌మైయర్‌ (0) ఫీల్డర్‌ను చూడకుండానే ముందుకొచ్చాడు. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్‌ రైనా వెంటనే ధోనీకి బంతి అందించాడు. దీంతో హెట్‌మెయర్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు.

Mar 23, 2019, 8:41 pm IST

ఆర్సీబీ vs చెన్నై మ్యాచ్‌ని వీక్షించడానికి చిదంబరం స్టేడియానికి వచ్చిన తలైవా రజనీకాంత్. చిదంబరం స్టేడియంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mar 23, 2019, 8:37 pm IST

బిగ్ వికెట్: ఏబీ డివిలియర్స్ (10) పరుగుల వద్ద హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇప్పటివరకు ఆర్సీబీ కోల్పోయిన మూడు వికెట్లు భజ్జీకే దక్కాయి.

Mar 23, 2019, 8:32 pm IST

పవర్‌ప్లే 6 ఓవర్లకు ముగిసే సమయానికి ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. పిచ్‌ మందకొడి పరిస్థితులను హర్భజన్‌ చక్కగా వినియోగించుకుంటున్నాడు. అతడు వేసిన 5.2వ బంతిని ఆడబోయి మొయిన్‌ అలీ (9; 8 బంతుల్లో 1×6) బౌలర్‌కే క్యాచ్‌ ఇచ్చాడు. అనంతరం క్రీజులోకి డివిలియర్స్ వచ్చాడు. ప్రస్తుతం క్రీజులో డివిలియర్స్‌ (5), పార్థివ్‌ పటేల్‌ (11) పరుగులతో ఉన్నారు.

Mar 23, 2019, 8:22 pm IST

ఐపీఎల్ 2019 సీజన్‌లో తొలి వికెట్‌ హర్భజన్‌ సింగ్‌కు లభించింది. భజ్జీ వేసిన 3.3వ బంతిని కోహ్లీ (6; 12 బంతుల్లో) పుల్‌ చేశాడు. గాల్లోకి లేచిన బంతిని జడేజా అందుకున్నాడు. ఈ మ్యాచ్‌‌లో భారీ ఆశలు పెట్టుకున్న కోహ్లీ అందరినీ నిరాశపరిచాడు.

Mar 23, 2019, 8:20 pm IST

6 పరుగుల వద్ద ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. ప్రస్తుతం 4 ఓవర్లకు ఆర్సీబీ వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది.ఈ సీజన్‌లో తొలి సిక్స్‌ను మొయిన్‌ అలీ (6; బంతుల్లో) బాదేశాడు. భజ్జీ వేసిన 3.6వ బంతిని డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా అద్భుతమైన సిక్సర్‌గా మలిచాడు. క్రీజులో పార్దీవ్ పటేల్(8), మొయిన్ అలీ(3) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Mar 23, 2019, 8:11 pm IST

తొలి ఓవర్‌ ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(1), పార్థీవ్‌(4) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Mar 23, 2019, 8:03 pm IST

ఈ మ్యాచ్‌‌లో అందరి కళ్లు కోహ్లీపైనే ఉన్నాయి. దీంతో పార్థివ్‌ పటేల్‌తో కలిసి విరాట్‌ కోహ్లీ ఓపెనింగ్‌ చేయనున్నాడు.

Mar 23, 2019, 7:56 pm IST

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు: పార్థివ్‌ పటేల్‌, విరాట్‌ కోహ్లీ, మొయిన్‌ అలీ, ఏబీ డివిలియర్స్‌, హెట్‌మయర్‌, శివమ్‌ దూబె, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌, ఉమేశ్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ సైనీ

Mar 23, 2019, 7:54 pm IST

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు: అంబటి రాయుడు, షేన్‌ వాట్సన్‌, సురేశ్‌ రైనా, ఎంఎస్‌ ధోనీ, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రావో, దీపక్‌ చాహర్‌, శార్దూల్ ఠాకూర్‌, హర్భజన్‌ సింగ్‌, ఇమ్రాన్ తాహిర్‌

Mar 23, 2019, 7:46 pm IST

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నైసూపర్‌ కింగ్స్‌నే టాస్‌ వరించింది. టాస్ గెలిచిన ఎంఎస్ ధోనీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. మ్యాచ్‌లో మంచు ప్రభావం అధికంగా ఉండనుంది. ఛేదనకు దిగిన జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Mar 23, 2019, 7:13 pm IST
Mykhel

ఈ సీజన్‌తో సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 5వేల పరుగుల క్లబ్‌లో చేరనున్నారు. మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై vs ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో 5వేల పరుగుల క్లబ్‌లో చేరేందుకు సురేశ్ రైనా 15 పరుగులు, విరాట్ కోహ్లీ 52 పరుగులు దూరంలో ఉన్నారు. చెన్నై టాస్ గెలిచి రైనా 15 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 5000 పరుగులు సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా సురేశ్ రైనా నిలుస్తాడు. అలా కాకుండా ఆర్సీబీ టాస్ గెలిచి కోహ్లీ 52 పరుగులు చేస్తే కోహ్లీ ఈ ఘనత సాధిస్తాడు.

Mar 23, 2019, 7:06 pm IST

ఆర్సీబీ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(710 పరుగులు) గుర్తింపు పొందాడు. ఇక, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం చెన్నైపై 732 పరుగులు నమోదు చేశాడు.

Mar 23, 2019, 7:03 pm IST

తొలి మ్యాచ్ కోసం చెన్నైలోని చెపాక్ స్టేడియానికి చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు.

Mar 23, 2019, 6:49 pm IST

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ చరిత్రలో బెంగళూరుపై చెన్నైదే ఆధిపత్యంగా కనిపిస్తోంది. 2008 నుంచి ఇప్పటి వరకూ చెన్నై, బెంగళూరు జట్లు 22 సార్లు తలపడగా.. ఏకంగా 14 సార్లు చెన్నై జట్టే విజయాన్ని అందుకుంది. మిగిలిన ఏడింట్లో బెంగళూరు గెలుపొందగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

Mar 23, 2019, 6:49 pm IST

2014, మే 24 నుంచి ఇప్పటి వరకూ ఆరుసార్లు ఈ రెండు జట్లూ తలపడగా.. ఆరింట్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టే విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలతో రెండేళ్లు నిషేధం ఎదుర్కొన్న చెన్నై జట్టు 2016, 2017 ఐపీఎల్‌ సీజన్లకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. చెన్నైపై చివరగా 2014, మే 18న బెంగళూరు జట్టు గెలిచింది.

Mar 23, 2019, 6:48 pm IST

ఐపీఎల్ 2019 సీజన్‌కి సర్వం సిద్ధమైంది. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈరోజు రాత్రి 8 గంటలకి జరిగే ఈ మ్యాచ్‌కి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

1
45757

Story first published: Saturday, March 23, 2019, 22:55 [IST]
Other articles published on Mar 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X