గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయాం.. చాలా బాధగా ఉంది: దినేశ్ కార్తీక్

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయాం. ఈ ఓటమి మమ్మల్ని బాధించింది అని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ అన్నారు. గురువారం రాత్రి రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ సీజన్‌లో వరుసగా ఆరో మ్యాచ్‌లో ఓడిపోయి ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపు కోల్పోయింది. సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన కోల్‌కతా తర్వాత అనూహ్యంగా పరాజయాల బాట పట్టి మూల్యం చెల్లించుకుంది.

ఓటమితో చాలా నిరాశ చెందాం:
మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ... ఓటమితో చాలా నిరాశ చెందాం. గెలవాల్సిన మ్యాచుల్లోనూ ఓడిపోయాం. ఈ రోజు కలిసిరాలేదు. గెలుపు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది. అయితే గెలవాల్సిన మ్యాచుల్లోనూ ఓడిపోతే ఆ బాధను చెప్పలేం. జట్టు సభ్యులంతా బాగానే అడారు. వాళ్ల ప్రదర్శనతో సంతోషంగా ఉన్నాను. కానీ.. ఓటమి కొంచెం బాధపెట్టింది' అని కార్తీక్ తెలిపారు.

మరింత ఒత్తిడి పెంచడం మంచిది కాదు:
'చివరి ఓవరల్‌లో పరుగులు రాకుండా ఆఫ్ స్టంప్ దిశగా బంతులు వేయాలని ప్రణాళిక రచించాం. మొదటి బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బౌండరీ వెళ్లింది. అలాంటివి మన చేతుల్లో ఉండవు. రెండో బంతికి.. ఆర్చర్ కొట్టిన సిక్సర్ మాత్రం మంచి షాట్. ఆఖరి ఓవర్‌లో బౌలర్ సహజంగా ఒత్తిడిలో ఉంటాడు. అలాంటి సమయంలో అతనిపై మరింత ఒత్తిడి పెంచడం మంచిది కాదని భావించాను. మంచు కూడా మా విజయావకాశాలను దెబ్బతీసింది' అని కార్తీక్ పేర్కొన్నారు.

కెప్టెన్‌గా ఎంతో నమ్మకం ఉంచారు:
మా జట్టు ఆటగాళ్లు చివరి వరకు పోరాడినందుకు ఆనందంగా ఉంది, కానీ పరాయజం బాధించింది. జట్టు సభ్యులు అందరూ కెప్టెన్‌గా నాపై ఎంతో నమ్మకం ఉంచారు. ఒక కెప్టెన్‌గా మైదానం, డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావరణం కల్పించడం నా బాధ్యత. ఏదేమైనా మేము విజయాలను అందులేకపోవడమనేది బాధాకరం' అని కార్తీక్ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications