నిమ్మకాయ మంత్రం వెనుక అసలు రహస్యం ఇదే!
ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు తరచుగా వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఇటీవల సీఎస్కే, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అభిమాని చేసిన 'ఫన్నీ బ్లాక్ మ్యాజిక్' సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ క్షణంలో ఏం జరిగిందో.. దాని వెనుక ఉన్న కథేమిటో ఆ వ్యక్తే స్వయంగా వివరణ ఇచ్చాడు.
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ యువకుడు గ్యాలరీలో కూర్చుని చేతిలో నిమ్మకాయ పట్టుకుని వింతగా మంత్రాలు చదువుతున్నట్లు యాక్టింగ్ చేశాడు. యాదృచ్చికంగా ఆ వ్యక్తి అలా చేయగానే మైదానంలో వికెట్ పడటంతో నెటిజన్లు దాన్ని చేతబడి అంటూ సరదాగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. టీవీ కెమెరాలు కూడా ఆ దృశ్యాన్ని బంధించడంతో ఆ వ్యక్తి రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయాడు.

నిమ్మకాయ వెనుక అసలు రహస్యం
ఈ ఘటనపై స్పందించిన ఆ యువకుడు (సన్నీ), తనకు చేతబడులు లేదా మంత్రాలు ఏమీ తెలియవని స్పష్టం చేశాడు. అసలు విషయం ఏమిటంటే.. ఆ రోజు సన్నీకి వాంతులు అయ్యేలా అనిపించడంతో, ఉపశమనం కోసం తనతో పాటు ఓ నిమ్మకాయను స్టేడియంలోకి తీసుకెళ్లాడు. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో సరదాగా చేతిలోని నిమ్మకాయతో ఏదో చేస్తున్నట్లు నటించానని ఆయన తెలిపాడు. ఆ సమయంలో తన మనసులో "మ్యాచ్ అయిపోయాక బిర్యానీ తినాలి.. రేపు ఏం పనులు ఉన్నాయి?" అనే సాధారణ ఆలోచనలు ఉన్నాయే తప్ప మంత్రాలు కావని నవ్వుతూ చెప్పారు. తాను అలా యాక్షన్ చేయగానే మైదానంలో వికెట్ పడటం చూసి తనే స్వయంగా షాక్ అయ్యానని.. అది కేవలం ఒక కాకతాళీయం మాత్రమేనని సన్నీ వివరించాడు.
సోషల్ మీడియా స్పందన
కేవలం నవ్వించడమే తన ఉద్దేశమని సన్నీ పేర్కొన్నాడు. అయితే నెటిజన్లు మాత్రం ఈ వీడియోను రకరకాల మీమ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నాడు. "హైదరాబాద్ ఫ్యాన్స్ పవర్ అంటే ఇదే" అని కొందరు, "నిమ్మకాయ మహిమ మామూలుగా లేదు" అని మరికొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఐపీఎల్ సీజన్‌లో ఇదొక మంచి వినోదాత్మక ఘటనగా నిలిచిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications