For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కార్తీక్ నవ్వమన్నాడనే నవ్వుతున్నా: షారూక్ ఖాన్

IPL: KKR Co-Owner Shah Rukh Khan Sends Skipper Dinesh Karthik A Special Twitter Message

హైదరాబాద్: కోల్‌కతా జట్టు సహ యజమాని అయిన షారూక్ ఖాన్ తన అధికారిక ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టాడు. దాంతో పాటు 'దినేశ్ కార్తీక్ నన్ను నవ్వమన్నాడు. అందుకే నవ్వుతూ ఇలా పోస్టు చేశాను. దానికి కారణం, ఆఖరి మ్యాచ్‌‌కు ముందు మా జట్టు ఓడిపోవడంతో నేను నిరుత్సాహానికి గురవడంతో అతను అలా కోరాడు' అని పేర్కొన్నాడు.

మే9న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 102పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ను నేరుగా వీక్షించేందుకు స్టేడియానికి వచ్చిన షారూక్ ఖాన్ మ్యాచ్ అనంతరం విచారం వ్యక్తం చేస్తూ స్టేడియాన్ని వీడిన దృశ్యాన్ని అందరూ చూశారు.

ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్ జట్టుపై హోరాహోరీగా పోరాడి 31పరుగుల తేడాతో ప్రత్యర్థిపై కోల్‌కతా గెలిచింది. దీంతో జట్టుపై కాస్త కనికరించిన షారూక్ ఇలా పోస్టు పెట్టి ఉండొచ్చు. ముంబైతో ఓటమి అనంతరం భారీ పట్టుదలతో క్రీజులోకి దిగిన కోల్‌కతా చక్కటి విజయాన్ని అందుకుంది. ఆ మ్యాచ్‌లో సునీల్ నరైన్ అద్భుతంగా రాణించి 36బంతుల్లోనే 75, దినేశ్ కార్తీక్ 23బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి జట్టు స్కోరు 245పరుగులను చేయగలిగారు.

దీంతో భారీ టార్గెట్‌ను చేధించలేక పంజాబ్ చతికిలిబడటంతో విజయం కోల్‌కతా వశమైంది. తన తరువాతి మ్యాచ్‌ను మూడు వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ జట్టుతో తలపడనుంది.

Story first published: Monday, May 14, 2018, 16:50 [IST]
Other articles published on May 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+